Pakisthan: ఇమ్రాన్‌ఖాన్ భార్య ఫ్రెండ్ బ్యాగ్ ధరే 90వేల డాలర్లు.. అక్రమంగా ఇంకెంత సంపాదించిందో ఈ తల్లి అంటున్న నెటిజన్లు..

|

Apr 07, 2022 | 7:48 AM

Pakisthan: పాకిస్థాన్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ ఇమ్రాన్ ఖాన్(Imran Khan) సన్నిహితులు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇమ్రాన్‌ ఖాన్‌..

Pakisthan: ఇమ్రాన్‌ఖాన్ భార్య ఫ్రెండ్ బ్యాగ్ ధరే 90వేల డాలర్లు.. అక్రమంగా ఇంకెంత సంపాదించిందో ఈ తల్లి అంటున్న నెటిజన్లు..
Farah Khan
Follow us on

Pakisthan: పాకిస్థాన్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ ఇమ్రాన్ ఖాన్(Imran Khan) సన్నిహితులు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇమ్రాన్‌ ఖాన్‌ మూడో భార్య బుస్రా బీబీ( Bushra Bibi )స్నేహితురాలు పాకిస్థాన్‌ను విడిచిపెట్టిన కొద్దిసేపటికే, ఆమె విలాసవంతమైన హ్యాండ్‌బ్యాగ్‌తో విమానంలో ప్రయాణిస్తున్నట్లు ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పాక్ దేశంలో నెలకొన్న రాజకీయ గందరగోళాల మధ్య అవినీతి ఆరోపణలు రావడంతో స్నేహితురాలు ఫరా ఖాన్ ఆదివారం దుబాయ్‌కు వెళ్లిపోయారు. ట్విటర్‌లో హల్ చల్ చేస్తోన్న ఈ ఫోటో.. విమానంలో ఆమె పాదాల దగ్గర ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌ కనిపిస్తుంది. అయితే ఈ ఫోటో ఎప్పుడు తీసిందో తెలియదు.

అయితే ఫరాఖాన్‌ దుబాయికి వెళ్లడం.. ఆ బ్యాక్ ధరపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆ  బ్యాగ్ విలువ 90,000 అమెరికన్ డాలర్లు అని పాకిస్థాన్‌లోని ప్రతిపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. ఆమె పాకిస్తాన్ నుంచి పారిపోయిందని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) నాయకుడు రోమినా ఖుర్షీద్ ఆలం ట్వీట్ చేశారు.

ఈ ఫోటోపై ట్విట్టర్ వినియోగదారులు డిఫరెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు. “దుబాయ్‌కి ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించాలంటే కేవలం 50,000 US డాలర్ల కంటే ఎక్కువ ఖర్చవుతుంది.  ఆమె చెప్పుల ధర కూడా ఎక్కువే.. అంటూ ఒక వినియోగదారు కామెంట్ చేశాడు. ఫరా ఖాన్ భర్త ఆమె కంటే ముందే పాకిస్థాన్ నుంచి వెళ్లిపోయాడని మరొకరు వ్యాఖ్యానించాడు. ఫరాఖాన్ పాక్ లోని “అన్ని కుంభకోణాలకు తల్లి”గా పేర్కొంటున్నాయి. పాకిస్థాన్‌లో అధికారులు తాము కోరుకున్న చోటకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇప్పించడం ద్వారా ఆమె 6 బిలియన్ల పాకిస్తానీ రూపాయలు ($32 మిలియన్లు) భారీ మొత్తంలో డబ్బు అక్రమంగా సంపాదించారని పాకిస్తాన్‌లోని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆమె వాడుతున్న బ్యాగ్ ధరే 90వేల డాలర్లు ఉంటె.. ఇంకెంత అక్రమంగా సంపాదించి ఉంటారో అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఇమ్రాన్‌, ఆయన భార్య చెప్పినట్లుగానే ఫరాఖాన్ ఈ అవినీతి చేసినట్టు పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌ ఉపాధ్యక్షురాలు మరియమ్‌ నవాజ్‌ ఆరోపించారు. అంతేకాదు.. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాను అధికారం నుండి తప్పుకున్న తర్వాత, తన “దొంగలు” తన అవినీతిని ఎక్కడ బయటపెడతారో నని  భయపడుతున్నాడని మరియమ్ సంచలన ఆరోపణలు చేశారు. అందుకనే ఇమ్రాన్ ఖాన్ స్నేహితులు, సన్నిహితులు అందరూ దేశం విడిచి పారిపోవడానికి పథకాలను రచిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆదివారం..  డిప్యూటీ స్పీకర్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడంతో ఖాన్ పార్లమెంటును రద్దు చేశారు. డిప్యూటీ స్పీకర్ చర్య “చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం” అని సవాల్ చేస్తూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

Also Read:Summer Drinks: వేసవి దాహార్తిని తీర్చే బటర్ మిల్క్.. డిఫరెంట్ స్టైల్‌లో తయారీ రెసిపీలు మీకోసం