ఇమ్రాన్ విమానానికి బ్రేక్ !..ఈ రాత్రికి న్యూయార్క్ లోనే..

|

Sep 28, 2019 | 5:06 PM

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రయాణిస్తున్న విమానానికి బ్రేక్ ! ఈ ప్లేన్ లో సాంకేతిక లోపం ఏర్పడడంతో న్యూయార్క్ లోనే నిలిపి వేశారు. ఎమర్జెన్సీ లాండింగ్ తప్పలేదు. ఇక విమానం కదలదని స్పష్టమయ్యాక.. ఇమ్రాన్, ఆయన వెంట ఉన్న ప్రతినిధిబృందం ఈ రాత్రికి న్యూయార్క్ లోనే ఉండిపోక తప్పదు.. అమెరికాలో దాదాపు నాలుగైదు రోజులు గడిపిన ఇమ్రాన్ ఖాన్.. శనివారం తిరిగి తమ స్వదేశం .. పాకిస్థాన్ కు బయలుదేరబోగా విమానానికి ఈ అంతరాయం ఏర్పడింది. […]

ఇమ్రాన్ విమానానికి బ్రేక్ !..ఈ రాత్రికి న్యూయార్క్ లోనే..
Follow us on

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రయాణిస్తున్న విమానానికి బ్రేక్ ! ఈ ప్లేన్ లో సాంకేతిక లోపం ఏర్పడడంతో న్యూయార్క్ లోనే నిలిపి వేశారు. ఎమర్జెన్సీ లాండింగ్ తప్పలేదు. ఇక విమానం కదలదని స్పష్టమయ్యాక.. ఇమ్రాన్, ఆయన వెంట ఉన్న ప్రతినిధిబృందం ఈ రాత్రికి న్యూయార్క్ లోనే ఉండిపోక తప్పదు.. అమెరికాలో దాదాపు నాలుగైదు రోజులు గడిపిన ఇమ్రాన్ ఖాన్.. శనివారం తిరిగి తమ స్వదేశం .. పాకిస్థాన్ కు బయలుదేరబోగా విమానానికి ఈ అంతరాయం ఏర్పడింది. ఐక్యరాజ్య సమితిలో అదేపనిగా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని, భారత దేశంతో ‘ యుధ్ధం బూచిని ‘ ఊదరగొట్టిన ఇమ్రాన్ ఇక రేపే.. పాకిస్థాన్ వెళ్లాల్సిందే..ప్రస్తుతం ఈ విమానంలోని సాంకేతిక లోపాన్ని సరిదిద్దే పనిలో పడ్డారు వైమానిక ఇంజనీర్లు.. .