Jemima Goldsmith on Imran Khan Comments: మహిళల వస్త్రధారణ, పరదా పద్దతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై మహిళలతో పాటు అన్ని దేశాలు మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ అందరూ ఇమ్రాన్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ వ్యాఖలపై తాజాగా ఆయన మాజీ భార్య జెమిమా గోల్డ్‌స్మిత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ట్విట్ చేసి ఇమ్రాన్ వ్యాఖ్యలను ఖండించారు. ‘‘కళ్లను నిరోధించి, ప్రైవేట్ భాగాలను కాపాడే బాధ్యత పురుషులపై ఉంది.. ఖురాన్ 24: 31 ఇదే చెబుతుంది.. ఈ వ్యాఖ్య నమ్మేవారికి చెప్పండి’’ అంటూ జెమిమా గోల్డ్‌స్మిత్ ట్విట్టర్ ద్వారా ఇమ్రాన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘ఇది ముమ్మాటికి తప్పుడు వ్యాఖ్యే.. ఇమ్రాన్.. స్త్రీ మీద కాదు పురుషుడి కళ్ళకు ముసుగు వేయండి’’.. అంటూ ఆమె ఘాటుగా ట్వీట్ చేశారు.
కాగా జెమిమా ట్వీట్‌ను వేలాది షేర్ చేసి పాక్ ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలపై పాకిస్తాన్‌తోపాటు పలు దేశాల ప్రజలు, హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో ఓ క్యాంపెయిన్ సైతం చేపట్టారు. అయితే రెండుసార్లు విడాకులు తీసుకున్న ఇమ్రాన్ ఖాన్ ముందు తననుతాను మారాలంటూ అందరూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కాగా మూఖాముఖీ కార్యక్రమంలో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలపై మాట్లాడారు. దేశంలో జరుగుతున్న లైంగిక నేరాల్లో కేవలం ఒక శాతం మాత్రం మీడియా ద్వారా వెల్లడవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో నానాటికి పెరగుతున్న లైంగిక నేరాలకు కారణం అశ్లీలతే అన్నారు. 70 దశకంలో తాను క్రికెట్ ఆడేందుకు బ్రిటన్‌కు వెళ్లిన సమయంలో అక్కడి సమాజంలో అశ్లీలత, మాదకద్రవ్యాల కల్చర్ వేళ్లూనుకోవడాన్ని గమనించినట్టు తెలిపారు. ప్రస్తుతం అక్కడ విడాకుల రేటు 70 శాతానికి పెరిగిందని, మితిమీరిన విసృంఖలత్వమే దీనికి కారణమన్నారు. అందుకే ఇస్లాంలో పరదా ధరించాలనే నిబంధన కోరికను నియంత్రించేందుకే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read: