ICC Arrest Warrant: తాలిబన్‌ అగ్రనేతలపై ఐసీసీ అరెస్ట్‌ వారెంట్‌… మహిళలు, బాలికలను హింసించినట్టు ఆరోపణలు

తాలిబన్‌ అగ్రనేతలపై ఐసీసీ అరెస్ట్‌ వారెంట్‌ చేసింది. మహిళలు, బాలికలను హింసించినట్టు ఆరోపణలు వ్యక్తమైన నేపథ్యంలో తాలిబన్ సుప్రీం లీడర్‌ హిబాతుల్లా అఖుంజాదా అప్ఘనిస్తాన్‌కు చెందిన అబ్దుల్ హకీంపై ఐసీసీ వారెంట్ పంపించింది. ఇద్దరు పాలకులు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని...

ICC Arrest Warrant: తాలిబన్‌ అగ్రనేతలపై ఐసీసీ అరెస్ట్‌ వారెంట్‌... మహిళలు, బాలికలను హింసించినట్టు ఆరోపణలు
Icc Arrest Warrant Taliban

Updated on: Jul 09, 2025 | 9:00 AM

తాలిబన్‌ అగ్రనేతలపై ఐసీసీ అరెస్ట్‌ వారెంట్‌ చేసింది. మహిళలు, బాలికలను హింసించినట్టు ఆరోపణలు వ్యక్తమైన నేపథ్యంలో తాలిబన్ సుప్రీం లీడర్‌ హిబాతుల్లా అఖుంజాదా అప్ఘనిస్తాన్‌కు చెందిన అబ్దుల్ హకీంపై ఐసీసీ వారెంట్ పంపించింది. ఇద్దరు పాలకులు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసీసీ ప్రీ-ట్రయల్ ఛాప్టర్‌ II, ఆర్టికల్ 7(1)(h) ప్రకారం తాలిబాన్ నాయకులు “మానవత్వానికి వ్యతిరేకంగా హింసకు ఆదేశించడం, ప్రేరేపించడం లేదా ప్రోత్సహించడం ద్వారా నేరానికి పాల్పడ్డారని” ఆక్షేపించింది. ఈ చర్యలు రాజకీయ అనుబంధాల ఆధారంగా ఉన్నాయని కోర్టు తెలిపింది.

తాలిబాన్ నాయకత్వంపై ఐసీసీ అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం ఇదే మొదటిసారి, ఇది ఆఫ్ఘనిస్తాన్ పాలకులను మానవ హక్కుల ఉల్లంఘనలకు జవాబుదారీగా ఉంచే ప్రపంచ ప్రయత్నాలలో ఒక ప్రధాన పరిణామంగా భావిస్తున్నారు. తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న ఆగస్టు 15, 2021 నుండి జనవరి 20, 2025 వరకు జరిగిన నేరాలలో హత్య, జైలు శిక్ష, హింస, అత్యాచారం మరియు బలవంతపు అదృశ్యాలు, ముఖ్యంగా మహిళలు మరియు బాలికలను లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

“తాలిబన్లు ప్రత్యేకంగా బాలికలు. మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను కోల్పోతున్నారు” అని కోర్టు పేర్కొంది. విద్య, స్వేచ్ఛ, గోప్యత, మతపరమైన వ్యక్తీకరణ హక్కులను తీవ్రంగా అణిచివేయడం పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాలిబన్ల నిర్బంధ విధానాలను వ్యతిరేకించిన వారిని హింసించడంపై కోర్టు మండిపడింది. శారీరక హింస మాత్రమే కాకుండా వివక్షతను పాటిస్తున్నారని ఐసీసీ పేర్కొంది. ఈ నేరాలు మరిన్ని జరగకుండా నిరోధించడానికి వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని ఆదేశించింది.