క్లైమేట్ ఛేంజ్ పై.. 16 ఏళ్ళ చిన్నారి.. టాప్ లేపుతోంది

|

Sep 27, 2019 | 3:11 PM

వాతావరణ మార్పుల కారణంగా, పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా ఈ భూమండలానికి ముంచుకొస్తున్న ముప్పుపై స్వీడన్ కు చెందిన 16 ఏళ్ళ బాలిక గ్రెటా థన్ బెర్గ్ ప్రారంభించిన ఉద్యమం వాల్డ్ వైడ్ అవుతోంది. సామాన్య జనాలనే గాక.. వాల్డ్ లీడర్లను కూడా జాగృత పరుస్తున్న ఈ చిన్నారి ఆందోళన అనేకమందికి స్ఫూర్తినిస్తోంది. ఇటీవల క్లైమేట్ ఛేంజ్ పై ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో జరిగిన సమావేశాలకు హాజరైన ఈమె.. అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ […]

క్లైమేట్ ఛేంజ్ పై.. 16 ఏళ్ళ చిన్నారి.. టాప్ లేపుతోంది
Follow us on

వాతావరణ మార్పుల కారణంగా, పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా ఈ భూమండలానికి ముంచుకొస్తున్న ముప్పుపై స్వీడన్ కు చెందిన 16 ఏళ్ళ బాలిక గ్రెటా థన్ బెర్గ్ ప్రారంభించిన ఉద్యమం వాల్డ్ వైడ్ అవుతోంది. సామాన్య జనాలనే గాక.. వాల్డ్ లీడర్లను కూడా జాగృత పరుస్తున్న ఈ చిన్నారి ఆందోళన అనేకమందికి స్ఫూర్తినిస్తోంది.

ఇటీవల క్లైమేట్ ఛేంజ్ పై ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో జరిగిన సమావేశాలకు హాజరైన ఈమె.. అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఉరిమిరిమి చూసిన వైనం తాలూకు వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రెటా..శుక్రవారం కెనడాకు విజిట్ చేయనుంది. ఈ దేశంలోనూ తన గళాన్ని వినిపించనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ లో అనేక వేలమంది ఆమెకు సంఘీభావంగా ప్రదర్శనలు చేశారు. వాతావరణ పరిరక్షణపై నేతల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కొంతమంది రోడ్లపై తమ వాహనాలు ఆపి.. పడుకుని.. వినూత్న ప్రొటెస్ట్ చేశారు.

ఈ ప్రదర్శనల్లో వివిధ దేశాలకు చెందిన ఉద్యమ కార్యకర్తలు వందల సంఖ్యలో పాల్గొన్నారు. అనేకమంది బాలలు కూడా చేత ప్లకార్డులు పట్టుకుని గ్రెటా అనుకూల నినాదాలు చేశారు. ఒకే ఒక్క బాలిక ఇంత భారీ ఉద్యమానికి తెర తీయడం తలలు పండినవారిని కూడా ఆశ్చర్యపరుస్తోంది.