AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాంకాంగ్ లో అల్లర్లు సద్దు మణిగినట్టేనా ? వివాదాస్పద బిల్లుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

హాంకాంగ్ లో దాదాపు రెండు నెలలకు పైగా కొనసాగిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు సద్దు మణిగినట్టేనా ? వివాదాస్పదమైన ‘ నేరస్థుల అప్పగింత ‘ బిల్లును వ్యతిరేకిస్తూ లక్షలాది ప్రజలు వీధుల్లో పెద్దఎత్తున నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. వీరిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు.. బాష్ప వాయువు ప్రయోగించారు… అనేకమందిని అరెస్టు చేశారు. కానీ వారి ఉద్యమం మాత్రం ఆగలేదు. చివరకు పార్లమెంటు ముట్టడికి కూడా సిధ్ధపడ్డారు. ఒక దశలో ఆందోళనలను అణచివేయడానికి చైనా […]

హాంకాంగ్ లో అల్లర్లు సద్దు మణిగినట్టేనా ? వివాదాస్పద బిల్లుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Sep 04, 2019 | 6:31 PM

Share

హాంకాంగ్ లో దాదాపు రెండు నెలలకు పైగా కొనసాగిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు సద్దు మణిగినట్టేనా ? వివాదాస్పదమైన ‘ నేరస్థుల అప్పగింత ‘ బిల్లును వ్యతిరేకిస్తూ లక్షలాది ప్రజలు వీధుల్లో పెద్దఎత్తున నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. వీరిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు.. బాష్ప వాయువు ప్రయోగించారు… అనేకమందిని అరెస్టు చేశారు. కానీ వారి ఉద్యమం మాత్రం ఆగలేదు. చివరకు పార్లమెంటు ముట్టడికి కూడా సిధ్ధపడ్డారు. ఒక దశలో ఆందోళనలను అణచివేయడానికి చైనా తన సైనికులను రంగంలోకి దింపాలని కూడా ప్రయత్నించింది. పైగా.. పొడవైన స్టిక్ ల వంటివాటితో ఆందోళనకారులకు విద్యుత్ షాక్ లు ఇఛ్చి వారిని భయభ్రాంతులకు గురి చేయాలని, వారిని గాయపరచాలన్న యోచన కూడా చేసింది. దీనిపై అమెరికా భగ్గుమంది. అలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని చైనాను హెచ్ఛరించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనూ, పైగా చివరకు నిరసనకారుల ఉద్యమానికి ప్రభుత్వం తల వంచక తప్పలేదు. తాజాగా ఈ బిల్లును ఉపసంహరిస్తున్నట్టు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ ల్యామ్ ప్రకటించారు. ఇంతకాలంగా జరుగుతున్న హింస, ఆందోళన మన సమాజానికి చేటు అని, దీనివల్ల సమాజ పునాదులే దెబ్బ తింటాయని ఆమె పేర్కొన్నారు. చైనా ప్రభుత్వంతో సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఆమె చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో లీక్ అయింది. అయితే ఇదంతా చైనా ఆడిస్తున్న నాటకమా అని నిరసనకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేరస్థుల అప్పగింత బిల్లును పూర్తిగా ఉపసంహరిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మా మధ్యకు వఛ్చి ఈ ప్రకటన చేయండి. దాగుడుమూతలు వద్దు అని నినదిస్తున్నారు. గతంలో కూడా ఈ విధమైన ప్రకటన చేసి మళ్ళీ బిల్లు అమలుకే ప్రభుత్వం మొగ్గు చూపిందని వారు ఆరోపిస్తున్నారు. క్యారీ ల్యామ్ నిజంగా ఈ ప్రకటన చేశారా అని అనేకమంది సందేహిస్తున్నారు.