ఆందోళనలతో అట్టుడుకుతున్న హాంకాంగ్..

| Edited By:

Jul 22, 2019 | 9:46 AM

చైనా పాలనను వ్యతిరేకిస్తూ.. హాంకాంగ్‌ వాసులు చేపడుతన్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. వరుసగా ఏడో ఆదివారమూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా  ఆందోళనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారులపై బైఠాయించారు. హాంకాంగ్‌లోని చైనా కార్యాలయంపై గుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. రబ్బరు బుల్లెట్లతో వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయితే నిరసనకారులు చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. Things […]

ఆందోళనలతో అట్టుడుకుతున్న హాంకాంగ్..
Follow us on

చైనా పాలనను వ్యతిరేకిస్తూ.. హాంకాంగ్‌ వాసులు చేపడుతన్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. వరుసగా ఏడో ఆదివారమూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా  ఆందోళనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారులపై బైఠాయించారు. హాంకాంగ్‌లోని చైనా కార్యాలయంపై గుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. రబ్బరు బుల్లెట్లతో వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయితే నిరసనకారులు చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు.

అల్లర్లకు పాల్పడిన వారిపై పోలీసులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. వారందరినీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు హాంకాంగ్‌ పై చైనా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ.. చైనా దౌత్యకార్యాలయాల పై దాడికి యత్నించారు.  లక్షలాదిగా తరలివచ్చిన నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో అదనపు బలగాలను మోహరించారు.