పాకిస్థాన్‌లో హిందువులపై మూక దాడి.. రక్షించిన ముస్లింలు..

పాకిస్థాన్‌లో మూక దాడి నుంచి 300 మంది హిందూ కుటుంబాలను పొరుగున ఉన్న ముస్లిం సోదరులు రక్షించారు. కరాచీలోని శీతల్‌దాస్‌ కాంపౌండ్‌లో..

పాకిస్థాన్‌లో హిందువులపై మూక దాడి.. రక్షించిన ముస్లింలు..

Updated on: Nov 06, 2020 | 6:18 PM

పాకిస్థాన్‌లో మూక దాడి నుంచి 300 మంది హిందూ కుటుంబాలను పొరుగున ఉన్న ముస్లిం సోదరులు రక్షించారు. కరాచీలోని శీతల్‌దాస్‌ కాంపౌండ్‌లో 300 హిందూ, 30 ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆదివారం అధిక సంఖ్యలో గుంపుగా వచ్చిన కొంతమంది వ్యక్తులు అక్కడున్న హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఆపై హిందువుల మీద దాడికి యత్నించారు.

Also Read: ఏపీ: 829 మంది టీచర్లకు.. 575 మంది విద్యార్ధులకు కరోనా.!

అయితే పొరుగున ఉన్న ముస్లింలు ఈలోపే కాంపౌండ్ గేటు వద్దకు చేరుకొని అడ్డుగా నిలబడి, వాళ్లను లోపలి రానివ్వకుండా ఆపారు. పోలీసులు కూడా విషయం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకోవడంతో అక్కడ నుంచి దుండగులు వెళ్లిపోయారు. హిందూ కుటుంబాలపై దాడిని అడ్డుకున్నది పొరుగున ఉన్న ముస్లిం కుటుంబాలని.. వారు లేకపోయి ఉంటే దాడిని అడ్డుకోవడం చాలా కష్టమయ్యేదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఈ సంఘటన తర్వాత అక్కడున్న 60 హిందూ కుటుంబాలను నగరంలోని వేరే ప్రాంతాలకు తరలించారు.

Also Read: మానవ తప్పిదమే కరోనా ‘సెకండ్ వేవ్’కు కారణం.. తస్మాత్ జాగ్రత్త..