పెళ్లి మండపానికి వెళ్లే ముందు వరుడు తన తల్లిపాలు తాగివచ్చాడనే వార్త ఇటీవల ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. తల్లి పాలివ్వడం అనేది ఆ తల్లి, బిడ్డల మధ్య సంబంధాన్ని మెరుగుపరిచే అంశం. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక వరం. శిశువులకు తల్లి పాలు అవసరం. కానీ ఒక ఇంగ్లీష్ మహిళ తన కొడుకు, మనవరాలికి ఒకే సమయంలో పాలివ్వడం నెటిజన్లను షాక్ అయ్యేలా అందరినీ గందరగోళానికి గురి చేస్తుంది. ఎందుకంటే.. వృద్ధులు మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఇక్కడ ఒక మహిళ మాత్రం తన మనవరాలు, ఆమె కొడుకు ఇద్దరికీ ఒకేసారి పాలిచ్చారని పేర్కొన్నారు. ఈ మహిళ కుమారుడు కూడా ఆమె మనవరాలి కంటే చిన్నవాడు. ఇదేంట్రా బాబోయ్.. ఇదేం వార్త..! IAS పరీక్ష ప్రశ్నలా గందరగోళంగా ఉందని ఆందోళనలో పడ్డారా..? అయితే, పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇక్కడ వార్తలో మనం చెప్పుకుంటున్న ఒక ఇంగ్లీష్ మహిళ తన కొడుకుకు జన్మనిచ్చినట్లే, ఆమె కుమార్తె కూడా బిడ్డకు జన్మనిచ్చింది. ఇంగ్లండ్‌లోని డాన్‌కాస్టర్‌కు చెందిన జేన్ మెక్‌నీస్ (47)కి 9 ఏళ్ల కుమారుడు, కుమార్తె లారా (27) ఉన్నారు. జేన్ 18వ ఏట లారాకు జన్మనిచ్చింది. లారా కూడా చిన్న వయసులోనే గర్భవతి అయింది. లారా 15 సంవత్సరాల వయస్సులో గర్భవతి అయ్యింది. ఈవీకి జన్మనిచ్చింది. ఈవీ అనే చిన్నారికి ఇప్పుడు 11 ఏళ్లు. అదే సమయంలో జేన్, ఆమె కుమార్తె లారా ఒకేసారి గర్భవతి అయ్యారు. దీంతో కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. జేన్ బెన్ అనే అబ్బాయికి జన్మనిచ్చింది. లారా బెల్లా అనే అమ్మాయికి జన్మనిచ్చింది. బెన్, బెల్లాకు ఇప్పుడు ఏడేళ్లు.
జేన్, ఆమె కుమార్తె ఒకే సమయంలో గర్భవతి అని తెలిసి తొలుత అందరూ ఆశ్చర్యపోయారు. చాలా మంది తమలో తామే చర్చించుకుంటూ నవ్వుకున్నారు. కానీ, జేన్ అవేవీ పట్టించుకోలేదు. తాను సంతోషంగా ఉన్నానని చెప్పింది. ఆమె తన కొడుకు, మనవరాలికి పాలిచ్చింది. ఇలాంటి యాధృచ్చిక సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని, ఎవరికీ దక్కని అవకాశం తనకు దక్కినట్టుగా జేన్ చెప్పింది. ఒకే సమయంలో అమ్మ, అమ్మమ్మ అయినందున తన మనవరాళ్లతో ఎక్కువ సమయం గడపలేక పోతున్నట్టు జేన్ చెప్పింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..