హెలీనా యాంటీ ట్యాంక్ మిస్సైల్ పరీక్ష విజయవంతం.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డీఆర్‌డీఓ

|

Feb 20, 2021 | 3:39 AM

HELINA anti-tank missiles: ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా రక్షణశాఖ మరో ముందడుగు వేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మరో ధృవాస్త్రం భారత అమ్ములపొదిలోకి వచ్చి..

హెలీనా యాంటీ ట్యాంక్ మిస్సైల్ పరీక్ష విజయవంతం.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డీఆర్‌డీఓ
Follow us on

HELINA anti-tank missiles: ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా రక్షణశాఖ మరో ముందడుగు వేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మరో ధృవాస్త్రం భారత అమ్ములపొదిలోకి వచ్చి చేరింది. డీఆర్‌డీఓ తయారు చేసిన హెలినా యాంటీ ట్యాంక్ మిస్సైల్‌ పరీక్ష విజయవంతమైంది. రాజస్థాన్‌ సెక్టార్‌లోని పోఖ్రాన్ టెస్ట్‌ రేంజ్‌లో శుక్రవారం భారత ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సంయుక్తంగా ఈ క్షిపణి శక్తి సామర్థ్యాలను పరిశీలించాయి. ఈ మేరకు ఏఎల్‌హెచ్‌ ధ్రువ్ హెలికాప్టర్‌కు 4 హెలినా యాంటీ ట్యాంక్ క్షిపణులను అమర్చి ప్రయోగించారు.

ఏడు కిలోమీటర్ల రేంజ్‌లో ప్రయోగించగలిగే ఈ క్షిపణి కనిష్ఠ, గరిష్ఠ పరిధి సామర్థ్యాలను అంచనా వేశారు. దీని కోసం గత ఐదు రోజులుగా నాలుగు మిషన్స్‌ నిర్వహించారు. నిర్దేశించిన ఐదు లక్ష్యాల్లో నాలుగింటిని హెలినా క్షిపణి ఛేదించినట్లు, ఈ ట్రయల్స్‌ విజయవంతమైనట్లు డీఆర్‌డీఓ వెల్లడించింది. ఇది ప్రపంచంలోనే అత్యాధునిక మిస్సైల్ అని వెల్లడించింది. దీని ద్వారా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ దళాలు.. ఎయిర్‌ టూ ల్యాండ్‌ లక్ష్యాలను చేధించవచ్చని వెల్లడించింది..

యాంటీ ట్యాంక్‌ క్షిపణి హెలినాలో ఇన్‌ఫ్రారెడ్‌ సీకర్‌, ఫైర్-అండ్-ఫర్‌గెట్‌ వంటి సామర్థ్యాలున్నాయి. హెలినా క్షిపణికి ఉన్న ప్రత్యేకమైన ఫైర్ అండ్ ఫర్‌గెట్‌ విధానం ద్వారా పరిధికి మించిన శత్రువు ట్యాంక్‌ను కూడా నాశనం చేయవచ్చు. ఆర్మీతోపాటు వాయుసేనలో వినియోగానికి ఈ క్షిపణిని అభివృద్ధి చేశారు. క్షిపణుల ప్రయోగం విజయవంతంపై డీఆర్‌డీవో, సైన్యం, వాయుసేనను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు. ఈ ప్రయోగాల్లో పాల్గొన్న సిబ్బందిని డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డి ప్రశంసించారు.

Also Read:

India – China Border Standoff: తూర్పు లడఖ్‌లో పూర్త‌యిన భారత్ – చైనా బ‌ల‌గాల ఉపసంహ‌ర‌ణ‌..

మోదీ ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించడం ఫ్యాష‌న్‌గా మారింది.. కేరళలో బీజేపీ ప్రభుత్వమే నా లక్ష్యం: మెట్రో శ్రీధరన్