అట్లాంటా కాల్పుల్లో ఆసియన్ మహిళల మృతి, పాప్ స్టార్ రిహానా ఖండన, విద్వేషానికి అంతమెప్పుడని ప్రశ్న
జార్జియాలోని అట్లాంటాలో జరిగిన కాల్పుల్లో మరణించిన 8 మందిలో ఆరుగురు ఆసియన్ మహిళలు ఉండడంపట్ల అంతర్జాతీయ పాప్ స్టార్ రిహానా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ దాడి ఘటనను ఖండిస్తూ ఆమె..
జార్జియాలోని అట్లాంటాలో జరిగిన కాల్పుల్లో మరణించిన 8 మందిలో ఆరుగురు ఆసియన్ మహిళలు ఉండడంపట్ల అంతర్జాతీయ పాప్ స్టార్ రిహానా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ దాడి ఘటనను ఖండిస్తూ ఆమె.. ఇది ఒక్కటే కాదని, ఈ విధమైన ఘటనలు ఎన్నో జరుగుతున్నాయని పేర్కొంది. విద్వేషం అన్నదానికి ముగింపు పలకాల్సిందే అని ఆమె తన ట్వీట్ లో వ్యాఖ్యానించింది. ‘ఇది బ్రూటల్, ట్రాజిక్ ఇన్సిడెంట్..విద్వేషం పెరిగిపోతోంది.. దీనికి ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పడాల్సిందే’ అని రిహానా కోరింది. ఆసియన్ కమ్యునిటీ పట్ల జరుగుతున్న ఈ విధమైన దాడులకు తన హృదయం ద్రవించిపోతోందని, అట్లాంటా ఘటనలో మరణించినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి అని ఆమె తెలిపింది. మంగళవారం నాడు అట్లాంటాలో గల మూడు స్పా లలో చొరబడిన రాబర్ట్ అనే యువకుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 8 మంది మృతి చెందారు. వీరిలో ఆరుగురు ఆసియన్ ‘ మహిళలు ఉన్నారు. ఇతడిని అరెస్టు చేసిన పోలీసులు..ఇది జాతి వివక్షతో కూడిన హత్యలా అన్న విషయాన్నీ ఇంకా నిర్ధారించలేదు. దర్యాప్తు మొదలు పెట్టామని, 8 మందిని హత్య చేసినట్టు ఇతనిపై అభియోగాలు మోపామని వారు చెప్పారు.
2020 మార్ఛి-డిసెంబరు మధ్య కాలంలో ఆసియన్ అమెరికన్లపై 3 వేలకు పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగియని ఆసియన్ అమెరికన్ అడ్వొకేసీ గ్రూపులు వెల్లడించాయి. కానీ 2019 లో 216 కేసులు నమోదైనట్టు ఈ బృందాలు పేర్కొన్నాయి. మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. పలువురు ఎంపీలు ఇటీవలే ఆసియన్ అమెరికన్లపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ట్వీట్లు చేశారు. రేసిస్టులు కొందరు వారిపట్ల చూపుతున్న ద్వేషాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకించారు. మన సొసైటీలో రెసిజానికి చోటు లేదని సత్య నాదెళ్ల అన్నారు. ఇవి సమాజానికి మచ్ఛ అని ఆయన అభివర్ణించారు. ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కూడా జాతి వివక్షను తాము సహించబోమని హెచ్చరించారు. కానీ అమెరికాలో ఇంకా వర్ణ వివక్ష కొనసాగుతూనే ఉంది. శ్వేత జాతీయులు ఆసియన్ అమెరికన్ల పట్ల ద్వేషాన్ని వెలిగక్కుతూనే ఉన్నారు. మరిన్ని చదవండి ఇక్కడ : కదులుతున్న కారులోంచి పడిపోయిన చిన్నారి..షాక్ అవుతోన్న నెటిజెన్ల : child fell out in running car video
ఆ సెక్స్ డాల్‌ను పెళ్లి చేసుకొని ఇప్పుడు నచ్చలేదని విడాకులు ఇచ్చేశాడు : divorced to sex doll Video.