Greta Thunberg – Disha Ravi: రైతుల ఆందోళనకు సంబంధించిన టూల్‌కిట్ కేసులో అరెస్టయిన దిశ రవికి మద్ధతుగా స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్ బర్గ్ ట్వీట్ చేసింది. స్వేచ్ఛ, నిరసన అనేది రాజీ పడకూడని మానవ హక్కులంటూ ఆమె ట్విట్ చేసింది. ‘‘వాక్ స్వాతంత్ర్యం, శాంతియుతంగా నిరసన తెలియజేసే స్వేచ్ఛ అనేవి రాజీ పడకూడని మానవ హక్కులు. ఇవి కచ్చితంగా ప్రతి ప్రజాస్వామ్యంలోని ప్రాథమిక హక్కుల్లో భాగమై ఉండాలి’’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. దీంతోపాటు.. ఈ ట్వీట్‌కు #StandWithDishaRavi అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా గ్రేటా జత చేసింది.
ఫ్రేడేస్ ఫర్ ఫ్యూచర్ ఇండియా సంస్థ చేసిన ట్విట్‌ను షేర్ చేస్తూ గ్రేటా ఈ ట్విట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఉద్యమం కోసం రూపొందించిన ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ సంస్థకు అనుంబంధంగా దీనిని దీనిని రూపొందించారు. ఈ సంస్థలో దిశ రవి కూడా సభ్యురాలిగా ఉంది.
టూల్‌కిట్ కేసులో అరస్టయిన 22 ఏళ్ల పర్యావరణ ఉద్యమకారిణి దిశ రవి జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో… శుక్రవారం మరో మూడు రోజులపాటు కస్టడీని పెంచుతూ ఢిల్లీలోని మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలిచ్చిన కొన్ని గంటల్లోనే స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్ బర్గ్ ఆమెకు మద్దతుగా ట్వీట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Also Read: