Rishi Sunak Daughter: యూకేలో డ్యాన్స్ ఫెస్టివల్.. కూచిపూడి డ్యాన్స్ తో అదరగొట్టిన ప్రధాని రిషి సునాక్ కుమార్తె..

|

Nov 26, 2022 | 1:14 PM

యూకే లో జరిగిన 'రాంగ్'- ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ 2022లో భాగంగా తొమ్మిదేళ్ల అనౌష్క పలువురు చిన్నారులతో కలిసి కూచిపూడి డ్యాన్స్ ను ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Rishi Sunak Daughter: యూకేలో డ్యాన్స్ ఫెస్టివల్.. కూచిపూడి డ్యాన్స్ తో అదరగొట్టిన ప్రధాని రిషి సునాక్ కుమార్తె..
Rishi Sunak Daughter
Follow us on

భారతీయ మూలాలు ఉన్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సనాతన హిందూ ధర్మాన్ని ఆచరిస్తారు. హిందువుల పండగలు పర్వదినాల సమయంలో దేవాలయాలకు వెళ్లడం పూజాదికార్యక్రమాలను నిర్వహించడం చూస్తూనే ఉన్నాం.. తాజాగా రిషికి భారతీయ సంస్కృతి, సాంప్రదయంపై ఉన్న మక్కువ మరోసారి వెలుగులోకి వచ్చింది. రిషి కుమార్తె అనౌష్క శుక్రవారం లండన్‌లో పలువురు చిన్నారులతో కలిసి కూచిపూడి ప్రదర్శన ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

యూకే లో జరిగిన ‘రాంగ్’- ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ 2022లో భాగంగా తొమ్మిదేళ్ల అనౌష్క పలువురు చిన్నారులతో కలిసి కూచిపూడి డ్యాన్స్ ను ప్రదర్శించింది. ఈ ఫెస్టివల్ లో  4-85 సంవత్సరాల మధ్య వయస్సు గల 100 మంది కళాకారులు, సంగీతకారులు, వృద్ధ నృత్య కళాకారుల  బృందం,  వీల్‌చైర్ డ్యాన్సర్, పోలాండ్‌లోని నటరాంగ్ గ్రూప్‌కు చెందిన అంతర్జాతీయ బర్సరీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

 

ఈ డ్యాన్స్ ఈవెంట్‌కు రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి  సహా రిషి తల్లిదండ్రులు హాజరయ్యారు. రిషి సునాక్ యునైటెడ్ కింగ్‌డమ్ 57వ ప్రధానమంత్రి గా పదవిని చేపట్టారు. ఈ పదవిని చేపట్టిన మొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. 42 సంవత్సరాల వయస్సులో రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా పదవిని చేపట్టి..  అతి పిన్న వయస్కుడైన బ్రిటిష్ ప్రధాన మంత్రిగా నిలిచారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..