Golden Visa: యూఏఈలో భారతీయుడికి అరుదైన గౌరవం.. ఆయనకే తొలిసారిగా..

|

Feb 15, 2022 | 12:37 PM

Golden Visa: యూఏఈ లోని కువైత్‌లో స్థిరపడ్డ భారత సంతతి వ్యక్తి, భారతీయ విద్యా భవన్(Bhartiya Vidhya Bhavan) ఛైర్మన్ ఎన్‌.కె. రామచంద్ర మీనన్‌కు(Ramachandra Meenan) అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఆయన అక్కడి ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన..

Golden Visa: యూఏఈలో భారతీయుడికి అరుదైన గౌరవం.. ఆయనకే తొలిసారిగా..
Golden Visa
Follow us on

Golden Visa: యూఏఈ లోని కువైత్‌లో స్థిరపడ్డ భారత సంతతి వ్యక్తి, భారతీయ విద్యా భవన్(Bhartiya Vidhya Bhavan) ఛైర్మన్ ఎన్‌.కె. రామచంద్ర మీనన్‌కు(Ramachandra Meenan) అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఆయన అక్కడి ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ వీసాను(Golden Visa) అందుకున్నారు. కువైత్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన రామచంద్ర.. 1969 నుంచి అక్కడే నివసిస్తున్నారు. 2000 సంవత్సరంలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో.. 2006లో తొలి పాఠశాల ‘ఇండియన్ ఎడ్యుకేషన్ స్కూల్’ ప్రారంభించారు. ఆ తర్వాత 2010లో అబుదాబిలో ‘ప్రైవేట్ ఇంటర్నెషనల్ ఇంగ్లీష్ స్కూల్’, 2014 సెప్టెంబర్‌లో అల్ ఐన్‌లో ‘అల్ సాద్ ఇండియన్ స్కూల్’, 2016 సెప్టెంబర్‌లో కువైత్‌లో ‘స్మార్ట్ ఇండియన్ స్కూల్’, 2018లో అజ్మాన్‌లో ‘వైజ్ ఇండియన్ అకాడమీ’, 2019 లో అల్ ఐన్‌లో భవన్స్ పెరల్ విజ్డమ్ స్కూల్, 2020 లో దుబాయ్‌లో భవన్స్ పెరల్ విజ్డమ్ స్కూల్ లను స్థాపించారు.

గోల్డెన్ వీసా ఎవరికిస్తారు..

2019లో యూఏఈ ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ యూఏఈలో విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనంకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే 100 శాతం ఓనర్‌షిప్‌తో అక్కడ సొంత వ్యాపారాలు నిర్వహించుకునే వెసులుబాటు సైతం ఉంది. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసా 10, 5 ఏళ్ల కాలపరిమితో ఉంటుంది. కాల పరిమితి తరువాత వీసాలను ఆటోమెటిక్‌గా పునరుద్ధరించే సౌలభ్యం కూడా ఉంది. పెట్టుబడిదారులు(కనీసం రూ. 20.50కోట్లు), పారిశ్రామికవేత్తలు, సైన్స్, నాలెడ్జ్, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, ప్రత్యేక ప్రతిభావంతులకు ఈ ప్రక్యేకమైన గోల్డెన్ వీసా ఇస్తారు.

ఈ భారత సెలబ్రిటీలకు గోల్డెన్ వీసా ఉంది..

ఇప్పటికే భారత్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు మంజూరు చేసింది. ఇలా గోల్టెన్ వీసాలు పొందివ వారిలో నటులు షారూఖ్ ఖాన్, సంజయ్ దత్, సునీల్ శెట్టి, మమ్ముట్టి, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, బోనీ కపూర్ ఫ్యామిలీ, గాయని చిత్ర, త్రిష, రాంచరణ్ సతీమణి ఉపాసన తదితరులు ఉన్నారు. అయితే, ఈ వీసా అందుకున్న కువైత్‌లో స్థిరపడిన తొలి భారత సంతతి వ్యక్తిగా ఎన్‌.కె రామచంద్రన్ నిలవడం విశేషం.

ఇవీ చదవండి..

Investment Tips: స్టాక్ మార్కెట్‌లో తొలిసారిగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా.. ఈ 5 అంశాలను తప్పక దృష్టిలో పెట్టుకోండి..

Axis Bank: యాక్సిస్ భారీ పెట్టుబడి నిర్ణయం.. అమెరికన్ బ్యాంక్ ను కొనుగోలు..