రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని కాన్‌స్టాంటినోవ్‌స్కీ ప్యాలెస్‌లో భారత ప్రధాని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మరోసారి కజాన్‌లో ప్రధాని మోదీ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. అక్టోబరు 22న కజాన్‌లో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నాను.” అని పుతిన్ అన్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ల ఈ సమావేశంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో తీసుకోవల్సిన అవకాశాలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా అజిత్ దోవల్ ప్రధాని తరపున కృతజ్ఞతలు తెలిపారు. తన ఇటీవల ఉక్రెయిన్ పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్న నరేంద్ర మోదీ గురించి కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
NSA దోవల్ తనను వ్యక్తిగతంగా కలిసే అరుదైన అవకాశాన్ని కల్పించినందుకు రష్యా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. టెలిఫోన్ సంభాషణలో ప్రధాని చెప్పినట్లుగా, ఉక్రెయిన్ పర్యటన, జెలెన్స్కీతో సమావేశం గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని దోవల్ చెప్పారు. ప్రధాని మోదీ స్వయంగా వచ్చి దాని గురించి చెప్పాలనుకున్నారు. అనుహ్యంగా తాను రావల్సి వచ్చిందన్నారు. ఈ సంభాషణ క్లోజ్డ్ ఫార్మాట్‌లో జరిగింది. ఇద్దరు నాయకులు మాత్రమే ఉన్నారు. ప్రధానితో ఉన్నాను, ఈ సంభాషణకు నేనే సాక్షి అని దోవల్ పుతిన్‌కు వివరించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం (సెప్టెంబర్ 12) ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం పెరుగుతున్న ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందని మరోసారి ప్రశంసించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్‌తో జరిగిన సమావేశంలో పుతిన్ భారత్‌ను ప్రశంసించారు.
తమ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఊపందుకుందని, మరింత బలపడుతోందని రష్యా పుతిన్ స్పష్టం చేశారు. దాని గురించి మేము సంతోషంగా ఉన్నామన్నారు. భారతదేశం బలపడుతుండటం, దాని ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ విజయం సాధ్యమని పుతిన్ స్పష్టం చేశారు.
#WATCH | Russian President Vladimir Putin had a meeting with Ajit Doval, National Security Advisor to the Prime Minister of India, at the Konstantinovsky Palace in St Petersburg.
(Source: Indian Embassy in Russia) https://t.co/gQsKyrb5XO pic.twitter.com/wle5qVXpjL
— ANI (@ANI) September 12, 2024
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..