అమెరికన్ రాజకీయాల్లో అడుగుపెట్టిన మొదటి భారతీయుడు ఉపేంద్ర చివుకుల. అమెరికాలో నివసించే భారతీయులందరికీ ఆయన స్ఫూర్తి ప్రదాత. తెలుగు అంటే ఎంతో మక్కువ ఉన్న ఆయన అమెరికాలో ఎన్నో రాజకీయ పదవులను నిర్వహించారు. భారతీయుల కీర్తిని ప్రత్యేకించి తెలుగువారి ఔన్నత్యాన్ని అక్కడ చాటి చెప్పారు. న్యూజెర్సీ రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవిని నిర్వహించారు. అంతే కాకుండా ఫ్రాంక్లిన్ టౌన్ షిప్ కు మేయర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం న్యూజెర్సీ స్టేట్ పబ్లిక్ యుటిలిటీస్ బోర్డు కమిషనర్ గా సేవలందిస్తున్న ఉపేంద్ర చివుకుల తన 71వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలను అమెరికాలోని తెలుగువారు ఘనంగా నిర్వహించారు. సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్‌లోని డెబ్బీ బాయిల్ సీనియర్ సెంటర్‌లో ఆహార క్యాన్ లను విరాళంగా ఇచ్చి ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. లూసీ పాత్రుని, శేఖర్ వేంపరాల మాధవి వేంపరాల, శ్రీ అట్లూరి, స్వాతి అట్లూరి, వంశీ వాసిరెడ్డి, ఉజ్వల్ కస్తాల, వినయ్ మేడిశెట్టి, ఫణి గౌతం, నాగేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, నాగ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇక సాయంత్రం సమయంలో దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ సంస్థల సభ్యులు అక్కడకు చేరుకొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందచేశారు. టాటా నుండి శ్రీనివాస్ గనగోని, తానా నుండి విద్యా గారపాటి, NATS నుండి మురళి మేడిచెర్ల, వెంకట్ మంత్రి ప్రగడ, అటార్నీ కవిత రామసామి, మిస్టర్ దాము గేదెల, సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి డెబ్బీ బాయిల్, వంశీ కొప్పురావూరి, అరుణ్, స్వరాజ్య నుండి జగదీష్ యలమంచలి, పుండరీక, శివరామ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సాయి దత్త పీఠం వ్యవస్థాపకుడు రఘు శర్మ శంకరమంచి ఆయనకు ప్రత్యేక ఆశీర్వాదాలు అందించారు … పుట్టినరోజు వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరూ న్యూజెర్సీ రాష్ట్రానికి చేసిన సేవలను ప్రశంసించారు.
Cruise Drugs Case: నేను అందుకే పార్టీకి వెళ్ళాను.. ఎన్సీబీ ముందు షారూఖ్ తనయుడు ఆర్యన్ ఒప్పుకోలు!