Kuchipudi Dance: అరంగేట్రంలోనే కూచిపూడి నృత్యంతో అదరగొట్టిన లహరి.. ప్రముఖుల ప్రశంసలు

|

Jul 07, 2022 | 9:23 PM

Lahari Kuchipudi Dance: జార్జియా రాష్ట్రం అట్లాంటాలో 17 ఏళ్ల లహరి పిసికె ప్రదర్శించిన కూచిపూడి ఆరంగేట్రం స్థానిక అమెరికన్లతో పాటు అహూతులైన.. తెలుగు వారిని ఎంతగానో ఆకట్టుకుంది.

Kuchipudi Dance: అరంగేట్రంలోనే కూచిపూడి నృత్యంతో అదరగొట్టిన లహరి.. ప్రముఖుల ప్రశంసలు
Kuchipudi Dance
Follow us on

Lahari Kuchipudi Dance: తెలుగు నేలపై ప్రాణం పోసుకున్న కూచిపూడి నాట్యం ఖండాంతరాలు దాటి ఉనికిని చాటుకుంటూనే ఉంది. అమెరికాతోపాటు విదేశాల్లో స్థిరపడిన భారతీయ కుటుంబాలు తమ పిల్లలకు శాస్త్రీయ నృత్యాలను నేర్పిస్తూ సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. జార్జియా రాష్ట్రం అట్లాంటాలో 17 ఏళ్ల లహరి పిసికె ప్రదర్శించిన కూచిపూడి ఆరంగేట్రం స్థానిక అమెరికన్లతో పాటు అహూతులైన.. తెలుగు వారిని ఎంతగానో ఆకట్టుకుంది. యూఎస్ అట్లాంటాలో పలు సాఫ్ట్ వేర్ సంస్థలు నిర్వహిస్తున్న వేణు కుమార్ రెడ్డి, వాసవి పిసికె దంపతుల కుమార్తె అయిన లహరి 8వ ఏట నుంచే అభ్యాసం ప్రారంభించింది. తాజాగా ఆదివారం నాడు తొలి ఆరంగేట్రం ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది.

కూచిపూడిలోని అత్యంత కఠినమైన 100 రకాలు పాద ముద్రలు, శిల్ప సదృశ్య దేహ భంగిమలు, హస్త ముద్రలు, కళ్ల కదలికలతో ముఖంలో అనేక భావాలను పలికించి లహరి అందరి ప్రశంసలు పొందింది. విఘ్నేశ్వర, నటరాజ పూజలతో మొదలైన లహరి నాట్య ప్రదర్శన నాలుగు గంటల పాటు నిర్విరామంగా సాగి అందరి ప్రసంశలు దక్కించుకుంది.

Lahari

లహరి తల్లిదండ్రులు వేణు కుమార్ రెడ్డి పిసికె, వాసవి. వేణు కుమార్ రెడ్డి స్వగ్రామం నల్లొండ జిల్లాలోని అల్వాల. వేణు కుటుంబంతో సహా 25 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి అనుబంధ సంస్థ అయిన అమెరికా క్రికెట్ బోర్డు వ్యవస్థాపక సభ్యుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. లహరి నృత్య ప్రదర్శన పట్ల నల్లగొండ వాసులు, పలువరు ప్రముఖులు హర్షం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..