International Yoga Day 2023: ఈసారి యోగా డే చాలా స్పెషల్.. యూఎన్‌లో యోగా సాధనను లీడ్ చేయనున్న ప్రధాని మోదీ..

|

Jun 21, 2023 | 7:11 AM

ప్రపంచ దేశాలన్నీ 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023) నేడు (జూన్ 21) ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఇన్నేళ్లపాటు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..

International Yoga Day 2023: ఈసారి యోగా డే చాలా స్పెషల్.. యూఎన్‌లో యోగా సాధనను లీడ్ చేయనున్న ప్రధాని మోదీ..
Pm Modi
Follow us on

ప్రపంచ దేశాలన్నీ 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023) నేడు (జూన్ 21) ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఇన్నేళ్లపాటు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తొలిసారిగా విదేశాల్లో నిర్వహిస్తున్న యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగా సాధనకు ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులు, వివిధ దేశాల రాయబారులు, ప్రముఖులు పాల్గొంటారు.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి న్యూయార్క్‌లో పర్యటించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ‘ప్రధాని మోదీ పాల్గొంటున్నందున ఈ ఏడాది యోగా వేడుక చాలా ప్రత్యేకమైనది’ అని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ పేర్కొన్నారు.

2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 69వ సెషన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ యోగా సాధనపై అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దినోత్సవం అనే ఆలోచనను ప్రతిపాదించారు. ఆరోగ్యం, శ్రేయస్సు కోసం యోగా ప్రాముఖ్యత, గుర్తింపునకై 93 UN దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఆ తరువాత అదే సంవత్సరం డిసెంబర్ 11న UNGA ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రకటించింది. జూన్ 21న అంతార్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. నాటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తన 3 రోజుల పర్యటనలో నోబెల్ గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులతో సహా మొత్తం 24 మంది ప్రముఖులతో సమావేశమవుతారు. అమెరికా పర్యటనకు ముందు వాల్ స్ట్రీట్ జర్నల్‌తో మాట్లాడిన మోదీ.. ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేందుకు భారత్‌కు అర్హత ఉందని పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచానికి పెద్ద పాత్రను కోరుకుంటోందన్నారు. భారతదేశం మరే ఇతర దేశాల స్థానాన్ని ఆక్రమించదని, ప్రపంచవ్యాప్తంగా భారత్ సముచిత స్థానం పొందుతోందని అన్నారు. అలాగే, వర్ధమాన దేశాల ఆకాంక్షలకు భారత నాయకత్వం ఒక గొంతుకగా గుర్తించబడాలని ఆయన ఆకాంక్షించారు.

యోగా ఆరోగ్యాన్ని ఇస్తుంది..

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. యోగా సామూహిక ఉద్యమంగా మారిందన్నారు. యోగా ప్రతిబంధకాలు, ప్రతిఘటనలు, వైరుధ్యాలను తొలగిస్తుందన్నారు. యోగా ఆరోగ్యాన్ని, ఆయుష్షును, బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..