Pramila Jayapal: మరోసారి అమెరికాలో జాత్యహంకార వ్యాఖ్యల కలకలం.. భారత దేశం వెళ్ళిపో అంటూ చట్టసభ సభ్యురాలుకి బెదిరింపు కాల్స్..

|

Sep 10, 2022 | 12:40 PM

ఆ వ్యక్తి చెన్నైలో జన్మించిన జయపాల్‌ను ఆమె స్వదేశమైన భారతదేశానికి తిరిగి వెళ్లమని కోరాడు. రికార్డింగ్‌లలోని భాగాలు సరిదిద్దబడ్డాయి.  అవి దుర్వినియోగ, జాత్యహంకార బెదిరింపులతో నిండి ఉన్నాయి.

Pramila Jayapal: మరోసారి అమెరికాలో జాత్యహంకార వ్యాఖ్యల కలకలం.. భారత దేశం వెళ్ళిపో అంటూ చట్టసభ సభ్యురాలుకి బెదిరింపు కాల్స్..
Pramila Jayapal
Follow us on

Pramila Jayapal: అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు కలకలం రేపాయి. సామాన్యుల నుంచి చట్ట సభలో సభ్యులైన వ్యక్తులు కూడా బాధితులుగా మారుతూనే ఉన్నారు. తాజాగా భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ ఉమెన్ ప్రమీలా జయపాల్ తనకు గుర్తు తెలియని వ్యక్తి నుండి బెదిరింపు సందేశాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వ్యక్తి పరుష పదజాలంతో దూషిస్తోన్న ఆడియో క్లిప్‌లను ప్రమీలా  సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వ్యక్తి చెన్నైలో జన్మించిన జయపాల్‌ను ఆమె స్వదేశమైన భారతదేశానికి తిరిగి వెళ్లమని కోరాడు. రికార్డింగ్‌లలోని భాగాలు సరిదిద్దబడ్డాయి.  అవి దుర్వినియోగ, జాత్యహంకార బెదిరింపులతో నిండి ఉన్నాయి. అలాంటి ఐదు ఆడియో సందేశాలను ప్రమీలా జయపాల్ పోస్ట్ చేశారు

“సాధారణంగా, రాజకీయ ప్రముఖులు తమ బలహీనతను చూపించరు. హింసను  మనం అంగీకరించలేము. కనుక తనకు వచ్చిన బెదిరింపులను బయట పెట్టడానికి సోషల్ మీడియాను ఎంచుకున్నాను” అని ఆమె ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు ఆధారంగా నిలిచే జాత్యహంకారం లింగ వివక్షనూ సహించేది లేదని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

చెన్నైలో జన్మించిన ప్రమీల జయపాల్.. మొట్టమొదటి భారతీయ- అమెరికన్ చట్టసభ్యురాలు‌. డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఆమె ప్రతినిధుల సభ లో సియాటెల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫోన్ కాల్స్ ద్వారా ప్రమీలను అనేక దుర్భాషలతో బెదిరించారు. ఒకరు “మీరు ****** ఎక్కడ నుండి వచ్చారో తిరిగి వెళ్లండి” అని కోరారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో జూలైలో సియాటిల్‌లోని ప్రమీలా జయపాల్ ఇంటి వెలుపల పిస్టల్‌తో ఒక వ్యక్తి కనిపించాడు. పోలీసులు బ్రెట్ ఫోర్సెల్ (49)గా గుర్తించిన ఆ వ్యక్తిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  రోజు రోజుకి అమెరికాలో ప్రవాస భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల టెక్సాస్ కు చెందిన మహిళ భారతీయ-అమెరికన్ల సమూహంపై జాత్యహంకార దుర్వినియోగం చేస్తూ కెమెరాకు చిక్కింది. బాధితులు రికార్డ్ చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఆ మహిళ “భారత్‌కు తిరిగి వెళ్లండి” అని వారిపై అరుస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 1న కాలిఫోర్నియాలో ఒకరిని, ఆగస్టు 26న టెక్సాస్‌లో నలుగురు మహిళలను ఇదే విధంగా కొంతమంది దుర్భాషలాడారు.

మరిన్నిగ్లోబల్ ఇండియన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..