బతుకుదెరువు కోసం వెళ్లి ఎడారి దేశంలో కష్టాలు పడుతోన్న తెలుగు కార్మికుడు.. బాధితుడికి లోకేశ్ భరోసా

|

Jul 15, 2024 | 8:22 AM

కువైట్‌ లో వేధింపులకు గురవుతున్న తెలుగు కార్మికుడి ఆవేదనపై స్పందించారు మంత్రి లోకేష్. ఎన్ఆర్‌ఐ బృందం ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర సహకారంతో బాధితున్ని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అయితే అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు.

బతుకుదెరువు కోసం వెళ్లి ఎడారి దేశంలో కష్టాలు పడుతోన్న తెలుగు కార్మికుడు.. బాధితుడికి లోకేశ్ భరోసా
Telugu Labour In Kuwait
Follow us on

బతుకుదెరువు కోసం దేశం కాని దేశం వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలుగు కార్మికుడి ఆవేదన మంత్రి లోకేష్ వరకూ చేరుకుంది. కువైట్‌లో వేధింపులకు గురవుతూ తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ తెలుగు కార్మికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై మంత్రి లోకేశ్ స్పందించారు. వీడియోలోని వ్యక్తిని గుర్తించామని తెలుగుదేశం ఎన్​ఆర్​ఐ బృందం ఆయన సేవ్ చేస్తుందని మంత్రి తెలిపారు. కేంద్ర సహకారంతో బాధితున్ని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అయితే అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. రాయచోటికి చెందిన ఏజెంట్ ద్వారా నెల రోజుల క్రితం కువైట్ కి వెళ్లాడు. తనకు చెప్పింది ఒక పని.. కాని కువైట్ వెళ్లాక దుర్భర జీవితం గుడుపుతున్నాని చెప్పాడు. ఏడారిలో వదిలేసి తీవ్రంగా వేదిస్తున్నారని శివ ఏడుస్తూ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


కువైట్ లో శివ పడుతున్న కష్టాలు చూసిన ఆయన భార్య పిల్లలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. దయచేసి తన తండ్రిని తిరిగి ఇండియాకు తీసుకొని రావాలని పిల్లలు వేడుకుంటున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఇక కువైట్ కు వెళ్లేందుకు చేసిన అప్పులుండగా.. భర్త శివను ఎలా రప్పించాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు శివ కుటుంబ సభ్యులు. శివ ఆవేదనపై స్పందించిన లోకేశ్- బాధితుడిని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..