Glacial Lakes: పొంచి ఉన్న మహా ఉపద్రవం! ప్రమాదపు అంచున 30 లక్షల మంది భారతీయులు

|

Feb 11, 2023 | 11:33 AM

భారతీయులను భయపెట్టే వార్తను చెప్పారు శాస్త్రవేత్తలు.. ఏ క్షణంలోనైనా సరే.. హిమనీనదాలు కరిగి వరదలు విజృంభించే అవకాశం ఉందని.. దీంతో దాదాపు 30 లక్షల మంది భారతీయులు వరద ముప్పుని ఎదుర్కోనున్నారని బ్రిటన్‌ న్యూకాజిల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడింది.

Glacial Lakes: పొంచి ఉన్న మహా ఉపద్రవం! ప్రమాదపు అంచున 30 లక్షల మంది భారతీయులు
Glacial Lakes
Follow us on

ప్రకృతి మానవాళిని గడగలాడిస్తోంది. వర్షాలు, వరదలు, సునామీ, భూకంపాలతో పాటు.. రకరకాల వైరస్ లు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. ఇటీవల టర్కీ, సిరియా దేశాలను భూకంపం వణికించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ సహాయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భారతీయులను భయపెట్టే వార్తను చెప్పారు శాస్త్రవేత్తలు.. ఏ క్షణంలోనైనా సరే.. హిమనీనదాలు కరిగి వరదలు విజృంభించే అవకాశం ఉందని.. దీంతో దాదాపు 30 లక్షల మంది భారతీయులు వరద ముప్పుని ఎదుర్కోనున్నారని బ్రిటన్‌ న్యూకాజిల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడింది. ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర మంది ప్రజలు ప్రమాదంలో ఉన్నారని అంచనా వేసింది. అంతేకాదు.. వీరిలో . సగానికి పైగా భారత్, పాకిస్థాన్, పెరూ, చైనాలోనే ఉన్నారని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. మన దాయాది దేశమైన పాకిస్థాన్‌లోనూ 20 లక్షల మందికి ముప్పు పొంచి ఉందని పేర్కొంది.

యూకే శాస్త్రవేత్తల నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం చేసిన అధ్యయనం నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో మంగళవారం ప్రచురించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమనీనదాల సరస్సులు కరగడం వల్ల ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందన్న విషయంపై ఈ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేశారు.  ఉపశమనానికి ప్రాధాన్యత గల ప్రాంతాలను కూడా పరిశోధకులు గుర్తించారు.

వాతావరణం వేడెక్కడం, భూతాపం పెరిగిపోవడం వంటి పరిణామాలతో హిమానీనదాలు కరిగిపోయే అవకాశాలు అధికం అవుతాయని.. అలా కరిగిన నీరు సరస్సుల్లా మారతాయని పేర్కొన్నారు. ఈ సరస్సులు అకస్మాత్తుగా పేలి..  వేగంగా ప్రవహిస్తూ.. వరదలను సృష్టిస్తాయని.. కొన్ని సందర్భాల్లో 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వరదలు సంభవిస్తాయని తెలిపారు. ఈ  బరస్ట్‌ ఫ్లడ్స్‌తో.. ఊహకు అందనంత నష్టం కలుగుతుందని..  ఆస్తి, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ భూమిని దెబ్బతీస్తాయి. భారీగా మనుషులను ప్రాణాలను బలిగొంటాయని తెలిపారు. ఫిబ్రవరి 2021లో ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో వచ్చిన వరదలు ఇందుకు ఉదాహరణ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

వాతావరణ మార్పుల ఫలితంగా 1990 నుండి హిమనదీయ సరస్సుల సంఖ్య వేగంగా పెరిగింది. అదే సమయంలో, ఈ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. పరిశోధనా బృందం ప్రపంచవ్యాప్తంగా 1,089 హిమనదీయ సరస్సు పరీవాహక ప్రాంతాలను.. పరివాహక ప్రాంతంలో 50 కిలోమీటర్లలోపు నివసించే వ్యక్తులను అధ్యయనం చేసింది. అలాగే ఆ ప్రాంతాలలో అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల కల్పన లాంటివన్నీ.. గ్లేసియల్ లేక్ అవుట్ బరస్ట్ ఫ్లడ్స్‌కు.. దారితీసేవిగా కనిపిస్తున్నాయని తేల్చింది. తమ అధ్యయనంలో తేలినట్లు ప్రమాదం కనుక సంభవిస్తే.. నష్టం భారీ స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు.

హిమనీనదాల సరస్సుల నుంచి 50 కిలోమీటర్ల లోపల.. కోటిన్నర మంది ప్రజలు నివసిస్తున్నారని.. తేల్చారు. కిర్గిస్థాన్ నుంచి చైనా వరకు ఉన్న టిబెట్ పీఠభూమిలో.. అత్యధికంగా వరదలు సంభవించే ప్రమాదం ఉందని.. దాదాపు 10 లక్షల మంది ప్రజలు ప్రమాదంలో ఉన్నారని న్యూకాజిల్ విశ్వవిద్యాలయంలో డాక్టరల్ విద్యార్థి, ప్రధాన పరిశోధకురాలు కరోలిన్ టేలర్ ఒక ప్రకటనలో తెలిపారు.

హిమనదీయ సరస్సులకు సమీపంలో నివసించే ప్రజల్లో గ్లేసియల్ లేక్ అవుట్ బరస్ట్‌లను తట్టుకునే వారి సామర్థ్యం లేదని ఈ మేరకు ప్రభుతలు చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్కడి స్థానిక పరిస్థితులను అర్థం చేసుకునేందుకు మరింత పరిశోధన అవసరమని బ్రిటన్ పరిశోధకులు గుర్తించారు. ఫ్లాష్ ఫ్లడ్స్ నుంచి ఏ ప్రాంతాలు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయన్నది అర్థం చేసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యమని.. అప్పుడే ముందస్తుగా చర్యలు చేపట్టి ప్రమాదం వలన జరిగే నష్టాన్ని తగ్గించగలమని తెలిపారు.   అత్యంత వేగంగా పెరిగిపోతున్న హిమనీనదాల సరస్సులతో.. ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు అధ్యయనం  సహ రచయిత..

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..