తేలియాడే స్టార్ హోటల్‌ని మించిన విలాసాలు.. ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ షిప్‌.. 13 అంతస్తుల్లో ఎన్ని గదులో తెలిస్తే..

|

Dec 21, 2023 | 8:03 PM

ఈ ఓడ పొడవు 237 మీటర్లని తయారీ సంస్థ తెలిపింది. మోబీ లెగసీలో 13 అంతస్తులు ఉంటాయి. పైన అంతస్తు వైశాల్యం 16వేల చదరపు మీటర్లు కాగా అందులో 10వేల చదరపు మీటర్ల స్థలాన్ని రెస్టారెంట్లు, విశ్రాంతి, వినోద సౌకర్యాల కోసం కేటాయించారు. ఇక ఇందులో మొత్తం 533 విలాసవంతమైన గదులు నిర్మించారు. ఇతర సౌకర్యాలలో రెండు బార్‌లు, రెండు రెస్టారెంట్లు, ప్రొమెనేడ్ మరియు పిల్లల ఆట స్థలం ఉన్నాయి.

తేలియాడే స్టార్ హోటల్‌ని మించిన విలాసాలు.. ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ షిప్‌.. 13 అంతస్తుల్లో ఎన్ని గదులో తెలిస్తే..
Moby Legacy Passenger Ship
Follow us on

చైనా మరో భారీ విలాసవంతమైన ఓడను నిర్మించి ప్రపంచం చూపు తన వైపు తిప్పుకుంది. గ్వాంగ్‌ఝౌ షిప్‌ యార్డ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించిన ఈ భారీ ఓడ పేరు మోబీ లెగసీ. మంగళవారమే ఈ నౌక తన సాగర ప్రయాణాన్ని ప్రారంభించింది. తన తొలి ప్రయాణంలో ఇది గ్వాంగ్‌ఝౌ తీరం నుంచి ఇటలీకి బయల్దేరింది. 70 వేల టన్నులకు పైగా బరువును తరలించే సామర్థ్యం మోబీ లెగసీ సొంతం.

మోబీ లెగసీ 2వేల 500ల మంది ప్రయాణికులను తరలించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వీటితో పాటు 800 కార్లు, ట్రక్కుల వంటి వాహనాలను తరలించే వీలుంటుంది. ఈ ఓడ పొడవు 237 మీటర్లని తయారీ సంస్థ తెలిపింది. మోబీ లెగసీలో 13 అంతస్తులు ఉంటాయి. పైన అంతస్తు వైశాల్యం 16వేల చదరపు మీటర్లు కాగా అందులో 10వేల చదరపు మీటర్ల స్థలాన్ని రెస్టారెంట్లు, విశ్రాంతి, వినోద సౌకర్యాల కోసం కేటాయించారు. ఇక ఇందులో మొత్తం 533 విలాసవంతమైన గదులు నిర్మించారు.

ఇతర సౌకర్యాలలో రెండు బార్‌లు, రెండు రెస్టారెంట్లు, ప్రొమెనేడ్ మరియు పిల్లల ఆట స్థలం ఉన్నాయి. స్టెర్న్ వద్ద పక్కపక్కనే ఉంచిన మూడు ర్యాంప్‌ల ద్వారా వాహన కార్గో లోడ్ మరియు అన్‌లోడ్ చేయబడుతుంది. సెంట్రల్ ర్యాంప్ ప్రధాన గ్యారేజ్ డెక్‌కి యాక్సెస్‌ను అందిస్తుంది, అయితే పోర్ట్ మరియు స్టార్‌బోర్డ్ సైడ్ ర్యాంప్‌లు నేరుగా మూడు ఎగువ గ్యారేజ్ డెక్‌లకు దారి తీస్తాయి. ఫెర్రీలో రెండు 5.4MW డీజిల్ ఇంజన్లు ఉన్నాయి, ఇవి గరిష్టంగా 25 నాట్‌ల కంటే ఎక్కువ వేగం మరియు 23.5 నాట్ల క్రూజింగ్ స్పీడ్‌ని అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

మోబి లెగసీని తేలియాడే స్టార్ హోటల్ అని కూడా అనవచ్చు. నచ్చిన ఆహారాన్ని అందించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలను కలిగి ఉన్న చెఫ్‌లు ఇక్కడ ఉన్నారు. సంగీతంతో పాటు కడలి అందాలను తిలకించేందుకు ప్రత్యేక స్పాట్లు ఈ షిప్‌లో ఉన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..