Bird Flu: ఫ్రాన్స్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో కోళ్లను చంపేయాలని డిసైడ్ అయ్యారు. ఫ్రాన్స్ దేశంలో నైరుతి ప్రాంతంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న 2.5 మిలియన్ల కోళ్లను చంపాల్సిన అవసరం ఉందని ఫ్రాన్స్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే దాదాపు 1.2 మిలియన్ల పక్షులను ఇప్పటికే చంపేయడం జరిగిందన్నారు. వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ముందుజాగ్రత్త చర్యగా అదనంగా 1.3 మిలియన్ల పక్షులను చంపాల్సిన అవసరం ఉందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
ఆసియా, ఐరోపా దేశాల్లో బర్డ్ ఫ్లూ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, పౌల్ట్రీల్లోని కోళ్ల ద్వారా ఈ బర్డ్ ఫ్లూ మరింత వ్యాప్తి చెందుతుండటంతో పౌల్ట్రీలలోని కోళ్లను చంపేయాలని డిసైడ్ అయ్యారు. అయితే, ఈ నిర్ణయం పౌల్ట్రీ పరిశ్రమలో ఆందోళన రేకెత్తిస్తోంది. గతంలోనే బర్డ్ ఫ్లూ కారణంగా దాదాపు 10 మిలియన్ల కోళ్లను చంపినట్లు అక్కడి అధికార వర్గాలు చెబుతున్నాయి.
Also read:
Anantapur Fire Accident: కొండపై ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలు.. భయాందోళనలో స్థానికులు!