వ్లాదిమిర్‌ పుతిన్‌ ఏజెంట్లు నా ఫోన్‌ కాల్స్‌ హ్యాక్‌ చేశారు: Liz Truss

|

Oct 30, 2022 | 1:59 PM

బ్రిటన్‌ ప్రధానిగా అధికారం చేపట్టిన 44 రోజుల్లోనే తీవ్ర ఆర్ధిక సంక్షోభం కారణంగా పదవి కోల్పోయిన లిజ్‌ ట్రస్ సంచలన ఆరోపణలు చేశారు. లిజ్‌ విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన..

వ్లాదిమిర్‌ పుతిన్‌ ఏజెంట్లు నా ఫోన్‌ కాల్స్‌ హ్యాక్‌ చేశారు: Liz Truss
Liz Truss's Phone Was Hacked By Russia
Follow us on

బ్రిటన్‌ ప్రధానిగా అధికారం చేపట్టిన 44 రోజుల్లోనే తీవ్ర ఆర్ధిక సంక్షోభం కారణంగా పదవి కోల్పోయిన లిజ్‌ ట్రస్ సంచలన ఆరోపణలు చేశారు. లిజ్‌ విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన ఏజెంట్లు  ట్రస్ ఫోన్‌ను హ్యాక్ చేసినట్లు మీడియాకు తెలిపారు. సదరు ఏజెంట్ల ద్వారా టాప్‌ సీక్రెట్స్‌ బయటికి వెళ్లినట్లు ట్రస్ ఆరోపించారు. ట్రస్ సన్నిహితుడైన క్వాసి క్వార్టెంజ్‌తో చర్చించిన విషయాలను ఫోన్‌ ద్వారా హ్యాక్‌ చేసి కీలక సమాచారం దొంగిలించారన్నారు. క్వాసీ క్వార్టెంగ్‌తో పంపించిన పలు మెసేజ్‌లు సైతం వారికి చేరాయన్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికి క్వాసీ క్వార్టెంగ్‌ బ్రిటన్‌ ఆర్ధిక మంత్రి అయ్యారు. ట్రస్‌ బిట్రన్‌ ప్రధాని పదవికి క్యాంపెయిన్‌ చేస్తున్న సమయంలో ఈ హ్యాక్‌ విషయం గుర్తించినట్లు డైలీ మెయిల్ కథనాలు శనివారం (అక్టోబర్‌ 29) వెల్లడించాయి.

ఈ సందేశాలలో ఉక్రెయిన్‌ యుద్ధం, ఆయుధాల రవాణాకు సంబంధించిన వివరాలతో పాటు అంతర్జాతీయ విదేశాంగ మంత్రులతో జరిపిన చర్చలు సైతం ఉన్నట్లు సమాచారం. మరో వైపు వ్యక్తిగత డేటాను రక్షించడంలో తమ వద్ద పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. కాగా ట్రస్ గత వారం బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయగా.. ఆ తర్వాత రిషి సునక్ ప్రధానిగా ఎంపికయ్యారు. కేవలం 44 రోజుల పాటు ప్రధానమంత్రిగా అన్న లిజ్ ట్రస్ రికార్డునెలకొల్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.