పొరుగుదేశం శ్రీలంకలో(Sri Lanka ) చీకటి రోజులు అలముకున్నాయి. లంకేయుల ఆకలి కేకలు మిన్నంటాయి. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. ప్రజలు ఆకలి అనే అంధకారంలో జీవిస్తున్నారు. కడుపు మంటతో రోదిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలతో గగ్గోలు పెడుతున్నారు. కిలో బియ్యం.. 500 రూపాయలు, కిలో చక్కెర 290, 400 గ్రాముల పాలపొడి 790 రూపాయలు.. కప్ టీ 100 రూపాయలు, 12.5 కిలోల వంట గ్యాస్ 4119 రూపాయలు పలుకుతుంది. వీటిని కొనడం కాదు కదా.. వాటి ధరలను చూసే సంగం మంది ప్రజలు చస్తున్నారు. ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకులు కొనలేక.. ఆకలితో పస్తులుంటున్నారు లంకేయులు. 1948లో స్వాతంత్య్రం తర్వాత మొదటి సారి శ్రీలంక అత్యంత దయనీయ పరిస్థితి ఎదుర్కొంటుంది.
డ్రాగన్ నుంచి తీసుకున్న భారీ అప్పుల కారణంగానే శ్రీలంక దివాళా తీయడానికి గల కారణాలుగా చెప్తున్నారు విశ్లేషకులు. ఆయిల్, ఆహారం, కాగితం, పప్పులు, ఔషధాలు, ఇలా ఒక్కటేంటి ప్రతిది విదేశీ దిగుమతులపైనే ఆధారపడింది లంక. ప్రజల రోజువారీ నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకోవడానికి శ్రీలంక వద్ద మార్చి నాటికి కేవలం 2.36 బిలియన్ డాలర్లు మాత్రమే మిగిలుండంతో ఏం చేయాలో అర్ధంకాక తలలు పట్టుకుంటుంది అక్కడి గవర్నమెంట్.
విద్యార్థులకు పరీక్షల నిర్వహణకు అవసరమైన పేపర్, ఇంక్ కూడా సరఫరా చేయలేని ఆందోళన పరిస్థితి నెలకొంది. రెండు వారాల క్రితం లీటర్ పెట్రోల్ ధర 50 రూపాయలు, డీజిల్ ధర 75 పెంచేయడంతో ఇప్పుడు లంకలో లీటర్ పెట్రోల్ ధర 254 రూపాయలు, డీజిల్ 176 రూపాయలకు చేరింది.
ఇక శ్రీలంకలో ఇప్పటికీ 20 శాతం కుటుంబాలు కిరోసిన్ స్టవ్‌లపైనే వంట చేసుకోవడంతో .. ఇప్పుడున్న పరిస్థితుల్లో కిరోసిన్ అందుబాటులో లేక చాలా కుటుంబాలు ఆహారం వండుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నాయి. కిరోసిన్, పెట్రోల్, డీజీల్ కోసం క్యూలైన్లలో భారీగా ప్రజలు వేసిచూసే పరిస్తితి నెలకొంది.
ఇవి కూడా చదవండి: Yogi Adityanath Oath: రెండోసారి ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యానాథ్.. కొత్త మంత్రి వర్గంలో మంత్రులు వీరే..