దేన్నైనా కాపీ చేయడంలో ఫస్ట్ ఉండే చైనా… ఇప్పుడు కల్తీ చేయడంలోనూ మేం ఏమాత్రం తక్కువ కాదంటోంది. లేటెస్ట్‌గా చైనాలో కల్తీ నూనెలకు సంబంధించిన ఓ భారీ కుంభకోణం… ఆ దేశంలో మంటలు రేపుతోంది. వంటకు వాడే నూనెలను తరలించే విధానం అక్కడి ప్రజలను గగుర్పాటుకు గురి చేస్తుంది. అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్‌ను తరలించే కంటైనర్లను శుభ్రపర్చకుండా.. వాటిలోనే కుకింగ్ ఆయిల్‌ను తరలించడం యావత్ దేశాన్నే కుదిపేస్తోంది. దీంతో చైనా ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా…? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది.
ఇంధన, సిరప్‌ల రవాణాకు వాడే ట్యాంకర్లనే కుకింగ్ ఆయిల్ తరలించేందుకు వాడుతున్నట్లు గుర్తించింది బీజింగ్ మీడియా. వాటిని సరిగ్గా శుభ్రం చేయకుండానే తిరిగి వంటనూనెలను తరలించినట్లు వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. దీంతో ప్రభుత్వంతో పాటు ఆహార భద్రతకు సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారని చైనా సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. అది విషమని తెలసి కూడా ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని ప్రజలూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ వ్యవహారంపై చైనాలోని సినోగ్రామ్ కంపెనీ దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. ట్రక్కులను తొలగించినట్లు పేర్కొంది. మరో ప్రభుత్వం రంగ కంపెనీ హోప్‌ఫుల్ గ్రెయిన్ కూడా దర్యాప్తు చేపట్టినట్లు ఆ దేశ జాతీయ మీడియాకు వెల్లడించింది. ఇలాగే 2008లో కూడా ఆహార కల్తీ కుంభకోణం ఆ దేశాన్ని కుదిపేసింది. సన్‌లూ మిల్క్ కుంభకోణంగా అప్పట్లో సంచలనంగా మారింది. మెలామైన్ అనే కెమికల్‌ను పాలపౌడర్‌లో వాడడంతో దాదాపు 3లక్షల మంది చిన్నారుల ఆరోగ్యం దెబ్బతిందని, అందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని ఆ ఇన్సిడెంట్‌ని ఇప్పుడు మరోసారి బయటకు తీస్తోంది బీజింగ్ మీడియా.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..