China Human Robots: చైనాలో మనిషిని పోలిన రోబోలు.. డేంజర్ బెల్స్ మోగినట్టేనా.?

కొంతమందిని చూస్తే.. మీరు ఒక్క ప్రశ్న కచ్చితంగా అడుగుతారు. నువ్వు మనిషివా? రోబోవా? అని. అదేంటి రోబోలను ఆమాత్రం పోల్చుకోలేమా అని మీరు అనుకోవచ్చు. మీ అనుమానం నిజమే. కాకపోతే.. చైనాలో ఓ కంపెనీ తయారుచేసిన రోబోలను చూస్తే.. కచ్చితంగా ఈ క్వశ్చన్ వేస్తారు. రోబో సినిమాలో చూసినట్లు.. అచ్చం మనిషిలానే ఆలోచించగలగడం, ఎమోషన్స్ ని ఫీల్ అవ్వగలగడం, మనిషికి మించి అద్భుతంగా పని చేయగలగడం.. ఇవన్నీ రోబోల రంగంలో వస్తున్న సరికొత్త మార్పులు. ఈ హ్యుమనాయిడ్ రోబోలు కాని మార్కెట్ లోకి వస్తే ఏమిటి పరిస్థితి?

China Human Robots: చైనాలో మనిషిని పోలిన రోబోలు.. డేంజర్ బెల్స్ మోగినట్టేనా.?

|

Updated on: Jul 11, 2024 | 7:26 PM

కొంతమందిని చూస్తే.. మీరు ఒక్క ప్రశ్న కచ్చితంగా అడుగుతారు. నువ్వు మనిషివా? రోబోవా? అని. అదేంటి రోబోలను ఆమాత్రం పోల్చుకోలేమా అని మీరు అనుకోవచ్చు. మీ అనుమానం నిజమే. కాకపోతే.. చైనాలో ఓ కంపెనీ తయారుచేసిన రోబోలను చూస్తే.. కచ్చితంగా ఈ క్వశ్చన్ వేస్తారు. రోబో సినిమాలో చూసినట్లు.. అచ్చం మనిషిలానే ఆలోచించగలగడం, ఎమోషన్స్ ని ఫీల్ అవ్వగలగడం, మనిషికి మించి అద్భుతంగా పని చేయగలగడం.. ఇవన్నీ రోబోల రంగంలో వస్తున్న సరికొత్త మార్పులు. ఈ హ్యుమనాయిడ్ రోబోలు కాని మార్కెట్ లోకి వస్తే ఏమిటి పరిస్థితి?

మీరు నవ్వితే ఆ రోబోలు నవ్వుతాయి. మీరు క్వశ్చన్ వేస్తే అవి ఆన్సర్ ఇస్తాయి. మీరు కోప్పడితే.. వాటికీ కోపమొస్తుంది. మీకు ఏ ఎమోషన్ ఉంటుందో దానికీ అదే ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. మరప్పుడు మనిషికీ, రోబోకు తేడా ఏమిటి? అన్న ప్రశ్న రావచ్చు. అందుకే కదా.. త్వరలో.. మీరు ఎవరితో మాట్లాడాలన్నా.. మనిషా, రోబోనా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పేది. ఇది నిపుణులు చెబుతున్న మాట. చైనాలోని డాలియన్ సిటీలోకి వెళితే.. అక్కడ మీకు అసలు సీన్ కనిపిస్తుంది. మనుషులను పోలిన రోబోలు మాత్రమే కాదు.. అవి మాట్లాడతాయి. నవ్వుతాయి. బాధపడతాయి. అన్ని రకాల ఎమోషన్స్ ను ఎక్స్ ప్రెస్ చేస్తాయి. అంటే.. దానికి ప్రాణం మాత్రమే లేదు. విచక్షణా జ్ఞానం ఉండదు.. అందుకే మనిషి చెప్పినట్టు ఆడుతున్నాయి. కానీ ఇప్పుడు ప్రాణం తప్ప.. మిగిలిన అన్ని విషయాల్లోనూ మనిషికన్నా ఎక్కువ క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్ ఉండేలా డిజైన్ చేస్తున్నారు.

చైనాలో ఎక్స్ రోబోస్ అనే హ్యూమనాయిడ్ రోబోల ఫ్యాక్టరీలోకి వెళితే.. మీకు అసలు కథ అర్థమవుతుంది. మనిషింత ఎత్తుతో ఉన్న రోబోలను తయారుచేస్తున్నారు. వీటికి ఇంకా అడ్వాన్స్డ్ వెర్షన్స్ కూడా ఉన్నాయి. అచ్ఛం మనిషిలానే నవ్వుతాయి. ఎమోషన్స్ ను క్లియర్ గా ఫేస్ పై పలికిస్తాయి. సిలికాన్ తో ఫేస్, లెగ్స్, హ్యాండ్స్.. ఇలాంటివాటిని ఈజీగా చేస్తున్నారు. వీటిని చూస్తే.. మనిషి చర్మాన్ని.. ఇంత పర్ఫెక్ట్ గా కనిపించేలా చేయడం గ్రేట్ అంటారు. ఇవన్నీ కరెక్ట్ గా ఫిట్ చేస్తే.. అప్పుడు దానిని చూసినవాళ్లకు ఒకటే డౌట్. ఇది మనిషా.. రోబోనా? అని. మీరు ఏడిస్తే అదీ ఏడుస్తుంది. మీరు చప్పట్లు కొడితే అదీ చప్పట్లు కొడుతుంది. మీరు నవ్వితే అదీ నవ్వుతుంది. అంటే మీ ఎక్స్ ప్రెషన్ ను అర్థం చేసుకుని.. దానికి అనుగుణంగా తన భావాన్ని మార్చుకుంటుంది. పైగా మనిషి భావోద్వేగాలను బట్టి ఈ రోబోలు నడుచుకుంటాయంటున్నారు. నిజానికి ఇది వండరే. కానీ దీనిని ఎక్కడ ఎలా ఉపయోగిస్తారు అన్నదానిపైనే ఇప్పుడు వీటి ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

ఏఐ టెక్నాలజీ ద్వారా మనిషి ఫీలింగ్స్ ను అర్థం చేసుకునే శక్తిని రోబోలకు ఇస్తున్నారు. దీనికోసం స్పెషల్ ప్రోగ్రామ్ ను కూడా డిజైన్ చేస్తున్నారు. వీటి ఫేస్ ను ఓపెన్ చేసి చూస్తే.. మీకు చాలా పరికరాలు కనిపిస్తాయి. ఇవన్నీ ఎందుకూ అంటే.. వీటి సాయంతోనే ఇవి.. మనిషి మాటలను, హావభావాలను, ఎమోషన్స్ ను అర్థం చేసుకుంటాయి. వాటికి అనుగుణంగా రియాక్ట్ అవుతాయి. ఇదంతా సరే.. మరి వీటితో భరోసా ఎంత? భయమెంత? ఎందుకంటే.. సక్రమంగా ఉపయోగిస్తే.. మనుషులకు తోడుగా ఉంటాయి. రివర్స్ లో వాడితే.. ప్రయోజనాలకు బదులు.. ప్రమాదాలు తప్పవు. అందుకే వైద్యరంగంలో కొన్ని పనుల్లో వీటి సేవలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us