Iraq Floods: కరవుతో అల్లాడిన దేశంలో భారీవర్షాలు.. మెరుపు వరద ధాటికి 12 మంది మృత్యువాత!

|

Dec 18, 2021 | 12:36 PM

ఇరాక్ దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. మెరుపు వరద ధాటికి ఇప్పటివరకు 12 మంది మరణించారని, వందలాది నిరాశ్రయులయ్యారని స్థానిక మీడియా తెలిపింది.

Iraq Floods: కరవుతో అల్లాడిన దేశంలో భారీవర్షాలు..  మెరుపు వరద ధాటికి 12 మంది మృత్యువాత!
Iraq Floods
Follow us on

Flash floods in northern Iraq: ఇరాక్ దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. మెరుపు వరద ధాటికి ఇప్పటివరకు 12 మంది మరణించారని, వందలాది నిరాశ్రయులయ్యారని స్థానిక మీడియా తెలిపింది. స్వయం ప్రతిపత్తి కల కుర్దిస్తాన్ ప్రాంత రాజధాని అర్బిల్‌లో రెండు రోజులుగా కుండపోత వర్షాల కురుస్తున్నాయి. దీంతో ఇక్కసారిగా రాజధాని నగరంతో సహా పలు ప్రాంతాల్లో వరదలు ముంచాయి. దీంతో ముగ్గురు విదేశీయులతో సహా 12 మంది మరణించారని ఇరాక్ అధికారి తెలిపారు. తీవ్రమైన కరవుతో అల్లాడిన ఇరాక్ దేశంలో భారీవర్షాలు కురిసి ప్రజల ఇళ్లలోకి వరద నీరు రావడంతో చాలామంది ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. మరణించిన 12 మందిలో 10 నెలల పాప, టర్కీ దేశీయులు, ఇద్దరు ఫిలిప్పీన్స్ జాతీయులు ఉన్నారని ప్రావిన్షియల్ గవర్నర్ ఒమిద్ ఖోష్నావ్ తెలిపారు. వరదనీటిలో వారి వాహనం కొట్టుకు పోవడంతో నలుగురు అత్యవసర సేవల సిబ్బంది గాయపడ్డారు.

మృతుల్లో ఒకరు పిడుగుపాటుకు గురై చనిపోయారని, మిగిలిన వారు ఇళ్లలోనే మునిగిపోయారని అత్యవసర సేవల ప్రతినిధి సర్కావ్ట్ కరాచ్ తెలిపారు.వరదల వల్ల పెద్దఎత్తున నష్టం వాటిల్లిందని, కొన్ని కుటుంబాలు తమ ఇళ్లను విడిచిపెట్టాల్సి వచ్చిందని కరాచ్ చెప్పారు. వరదనీటిలో బస్సులు, ట్రక్కులు, ట్యాంకర్ ట్రక్కులు కొట్టుకుపోయాయి.ఖోష్నావ్ నివాసితులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచించారు.

ఇరాక్‌లోని సెమీ అటానమస్ ప్రాంతమైన కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్ నగరం ప్రావిన్స్‌లోని ఇతర పట్టణాల్లో వీధులు, ఇళ్లను ముంచెత్తుతున్న బురద జలాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు చూపిస్తున్నాయి. రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని స్థానిక అధికారులు తెలిపారు. తప్పిపోయిన అనేక మంది వ్యక్తుల కోసం అధికారులు వెతుకుతూనే ఉన్నారని ఎర్బిల్ పౌర రక్షణ విభాగానికి చెందిన సర్కావ్ట్ తహసీన్ చెప్పారు. దేశంలోని ఉత్తర కిర్కుక్ ప్రావిన్స్‌లోని ఇరాక్ భద్రతా దళాలు కుండపోత వర్షాల కారణంగా వారి ఇళ్లలో చిక్కుకున్న అనేక కుటుంబాలను రక్షించాయని రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.

Read Also….  చనిపోయాడనుకుని అంత్యక్రియలు.. భార్యకు మరో పెళ్లి.. 12 ఏళ్ల తర్వాత ఊహించని ట్విస్ట్..