Moon resort Dubai : దుబాయ్ ఎన్నో.. విలాసవంతమైన వస్తువులకు, ప్రదేశాలకు నిలయం…ఇప్పుడు మరో అరుదైన ప్రాజెక్టుకు వేదిక కాబోతుంది. “డెస్టినేషన్ రిసార్ట్ తరహాలో 5 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి దుబాయ్.. ఓ మూన్ బిల్డింగ్‌ని రూపొందించనుంది. ఈ దశాబ్దం పూర్తయ్యేలోగా ఈ నిర్మాణం పూర్తికాబోతున్నట్లు తెలుస్తోంది. కెనడాకు చెందిన ఓ ఆర్కిటెక్ కంపెనీ దీనిని నిర్మిస్తుంది. 48 నెలల్లో ఈ మూన్ రిసార్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచించారు. దీని మొత్తం ఎత్తు 735అడుగులు,” అని అరేబియన్ బిజినెస్ తన నివేదికలో పేర్కొంది.
అల్ట్రా-విలాసవంతమైన హోటల్… ఇది చంద్రుని ఉపరితలం ప్రతిరూపంగా ఉంటుంది. ఆతిథ్యం, వినోదం, ఆకర్షణలు, విద్య, సాంకేతికత, పర్యావరణం, అంతరిక్ష పర్యాటకం వంటి రంగాలలో “మూన్ దుబాయ్” ఎమిరేట్ ఆర్థిక వ్యవస్థకు జోడిస్తుందని ఆర్కిటెక్చరల్ సంస్థ విశ్వసిస్తోంది. ఈ మూన్ రిసార్ట్‌లో వార్షికంగా 2.5మిలియన్ గెస్టులు వస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. భూమిపైనే అంతరిక్ష అనుభూతిని పొందే విధంగాను ఈ మూన్ రిసార్ట్‌ను తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రపంచంలోనే అతిపెద్ద మోడరన్ టూరిజం ప్రాజెక్ట్‌గా పేర్కొన్నారు.
మూన్ దుబాయ్ రిసార్ట్స్ ను ఏడాదికి కోటి మంది పర్యాటకులు సందర్శిస్తారని వారు వెల్లడించారు. ఈ రిసార్ట్‌లో స్పా, వెల్‌నెస్ సెక్షన్, నైట్ క్లబ్, ఈవెంట్ సెంటర్, గ్లోబల్ మీటింగ్ ప్లేస్, లాండ్, మూన్ షట్టల్ వంటి పలు ఎట్రాక్షన్స్ ఉన్నట్లు వారు వెల్లడించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి