Sri Lanka Ship: కొలంబో తీరం సమీపంలో అగ్ని ప్రమాదానికి గురైన శ్రీలంక కంటైనర్ నౌకలో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు భారతీయ తీర రక్షణ దళం రంగంలోకి దిగింది. నౌకలో చెలరేగుతున్న మంటలను నియంత్రించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే శ్రీలంక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై స్పందించిన భారత ప్రభుత్వం సత్వరం సాయం అందించేందుకు సముద్ర జలాల్లో గస్తీ విధుల్లో ఉన్న వజ్రా, వైభవ్, నౌకలను సంఘటన స్థలానికి మళ్లించింది. మంటలను అదుపు చేయడంలో ఈ రెండు నౌకలు పూర్తిగా నిమగ్నమయ్యాయి. అయితే ఈ నౌకలో 25 టన్నుల నైట్రిక్ యాసిడ్‌తో సహా దాదాపు 1,500 కంటైనర్లను తీసుకెళ్తోంది. కొలంబో నౌకాశ్రయంలోకి ప్రవేశించడానికి కొంత సమయం ఉండగానే మంటలు చెలరేగాయి. నౌకలో ఈ యాసిడ్ ఉండటంతో మంటలు అదుపులోకి రావడం లేదు. అయితే ఈనెల 25 నౌకలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. భారీగా మంటలు చెలరేగుతున్నాయి.
అలాగే కాలుష్యాన్ని నియంత్రించే ప్రత్యేక సదుపాయాలు ఉన్న ఐసీజీ సముద్ర అనే నౌకను కూడా ప్రమాదస్థలానికి అధికారులు తరలించారు. అగ్ని జ్వాలలను అదుపు చేసే చర్యలను మరింత వేగవంతం చేసేందుకు సముద్ర జలాల్లో చమురు తెట్టు ఏదైనా ఆవరించి ఉంటే దానిని నివారించేందుకు ఈ నౌక ఎంతగానో ఉపయోగపడుతుంది. మరోవైపు తీర రక్షణ దళానికి చెందిన ఐసీజీ డోనియా విమానం కూడా ఘటన జరిగిన ప్రాంతంలో తిరుగుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది.