ఇదేక్కడి ఆచారం రా అయ్యా! పెళ్లికి ముందు వధువుపై ఉమ్మివేయాలి.. ఇందులో మరో ట్విస్ట్ కూడా..

|

Feb 04, 2023 | 7:45 AM

ఉమ్మివేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది వారి సంస్కృతి, సంప్రదాయంలో భాగం. కూతురు కూడా తండ్రి ఉమ్మిని తన వరంలా భావిస్తుంది. ఇలా చేయడం వల్ల..వచ్చే జన్మలో ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు. తండ్రితో ఇలా ఆశ్వీరాదం తీసుకుంటే..

ఇదేక్కడి ఆచారం రా అయ్యా! పెళ్లికి ముందు వధువుపై ఉమ్మివేయాలి.. ఇందులో మరో ట్విస్ట్ కూడా..
Wedding
Follow us on

వైవిధ్యంతో నిండిన ప్రపంచంలో మనం కొన్ని ప్రత్యేకమైన ఆచారాలను చూస్తుంటాం. ప్రపంచంలోని ప్రతి వర్గంవారు వివిధ ఆచారాలను అనుసరిస్తుంటారు. వారిని చూస్తుంటే వింతగా అనిపిస్తుంది. ఈ ఆచారాలు, సంప్రదాయాలు కొన్నింటిని మనుషులు వారికి వారుగా ఏర్పాటు చేసుకున్నవి అయితే, మరికొన్ని పౌరాణిక చరిత్రల ఆధారంగా అనుసరిస్తున్నవి కొనసాగిస్తుంటారు. ఈ రోజు మనం ఒక వింత సంప్రదాయం గురించి తెలుసుకుందాం..ఇది మీరు గతంలో ఎక్కడా చూసుండరు.

ప్రతి సమాజానికి దానికంటూ సొంత సంస్కృతి, కొన్ని సంప్రదాయాలు, కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఆ సమాజంలో నివసించే ప్రతి వ్యక్తి దానిని పాటించాలి. వివాహం సాధారణంగా అన్ని సమాజాలలో జరుగుతుంది. కానీ, ప్రతిచోటా వివాహం కోసం వివిధ సంప్రదాయాలు అవలంబిస్తారు. వాటిలో కొన్ని చాలా వింతగా ఉంటాయి. వాటి గురించి వింటే మీరు షాక్ అవుతారు. ఎక్కడ చూడని వింత సంప్రదాయం మాసాయి తెగ వారు అనుసరిస్తుంటారు. మాసాయి తెగ అని పిలువబడే ఒక ప్రత్యేక తెగ కెన్యా, టాంజానియాలోని కొన్ని ప్రాంతాలలో నివసిస్తుంది. ఈ తెగలో పెళ్లిళ్లు చాలా వింతగా, విచిత్రంగా జరుగుతుంటాయి. వివాహ సమయంలో వధువు తండ్రి కూతురి ఛాతీ, తలపై ఉమ్మివేసి ఆశీర్వదిస్తాడు. కూతురు కూడా తండ్రి ఉమ్మిని తన వరంలా భావిస్తుంది. ఇలా చేయడం వల్ల..వచ్చే జన్మలో ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు. తండ్రితో ఇలా ఆశ్వీరాదం తీసుకుంటే.. కూతురి కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటాయని ఇక్కడి ప్రజలు గాఢంగా నమ్ముతారు.

కెన్యా గిరిజనుల ప్రకారం, ఉమ్మివేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది వారి సంస్కృతి, సంప్రదాయంలో భాగం. అంతేకాకుండా, టాంజానియా తెగలలో కూడా ఉమ్మి వేసే సంప్రదాయం కనిపిస్తుంది. ఇక్కడి ప్రజలు కూడా దీన్ని గౌరవంగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి

మరో విచిత్రం ఏంటంటే..మాసాయి తెగలో ఉమ్మి వేయడం ఇతర సందర్బాల్లోనూ చేస్తుంటారు. ఎవరినైనా పలకరించేటప్పుడు కరచాలనం చేసే ముందు అరచేతిపై ఉమ్మివేయడం చేస్తుంటారు. పెళ్లి తర్వాత అప్పగింతల సమయంలో కుటుంబసభ్యులు కూతురిని పంపించివేస్తే.. ఆ నవ వధువు వెనక్కి తిరిగి చూడొద్దనే నిబంధన కూడా సంప్రదాయంగా పాటిస్తుంటారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..