వడదెబ్బతో విద్యార్ధి మృతి.. రూ.115 కోట్లు పరిహారం చెల్లించిన యాజమాన్యం

|

Mar 28, 2023 | 10:57 AM

వడదెబ్బ తలిగి దాహంతో ఉన్న విద్యార్ధి దప్పిక తీర్చుకోవడం కోసం నీళ్లు అందించమని ప్రాదేయపడినా ఒక్కచుక్కకూడా అందించలేదు ఈ యూనివర్సిటీ యాజమన్యం. దీంతో విద్యార్ధి అక్కడికక్కడే మృతి చెందాడు. తమ కుమారుడి మరణానికి..

వడదెబ్బతో విద్యార్ధి మృతి.. రూ.115 కోట్లు పరిహారం చెల్లించిన యాజమాన్యం
Sunstroke
Follow us on

వడదెబ్బ తలిగి దాహంతో ఉన్న విద్యార్ధికి గుక్కెడు నీళ్లు ఇవ్వడానికి యూనివర్సిటీ యాజమన్యం నిరాకరించింది. దప్పిక తీర్చుకోవడం కోసం నీళ్లు అందించమని ప్రాదేయపడినా ఒక్కచుక్కకూడా అందించలేదు. దీంతో విద్యార్ధి అక్కడికక్కడే మృతి చెందాడు. తమ కుమారుడి మరణానికి యూనివర్సిటీ యాజమాన్యమే కారణమంటూ బాధిత కుటుంబం భారీ నష్టపరిహారం కోరింది. వివరాల్లోకెళ్తే.. అమెరికాలోని కెంటకీ యూనివర్సిటీలో 2020లో రెజ్లింగ్‌కు సంబంధించి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి బ్రేస్‌ అనే 20 ఏళ్ల యువకుడు పాల్గొన్నాడు. రెజ్లింగ్‌ శిక్షణలో వడ దెబ్బకు గురైన బ్రేస్‌ ఆగస్టు 31న అస్వస్థతకు గురయ్యాడు. దాహం తీర్చుకోవడం కోసం నీళ్లు అడిగితే అక్కడున్న కోచ్‌లు నిరాకరించారు. ఇదంతా శిక్షణలో భాగమని, బ్రేస్‌కు మరెవ్వరూ నీళ్లివ్వద్దంటూ కోచ్‌లు అడ్డుకున్నారు. దీంతో డీహైడ్రేషన్‌కు గురైన బ్రేస్‌ కొద్దిసేపటికే మరణించాడు. తమ కుమారుడి మరణానికి యూనివర్సిటీ యాజమాన్యమే కారణమని, తమ కుమారుడిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మృతి చెందాడంటూ బ్రేస్‌ కుటుంబ సభ్యులు కోర్టులో దావా వేశారు.

దీంతో సదరు యూనివర్సిటీ 14 మిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. అంటే భారత కరెన్సీలో రూ.115 కోట్లు. సంఘటన జరిగిన రోజు సెషన్‌లో పాల్గొన్న ఇద్దరు కోచ్‌లు రాజీనామా చేసినట్లు యూనివర్సిటీ తెలిపింది. బ్రేస్‌ అకాల మరణానికి చింతిస్తున్నాం. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించాం అని ఈ యూనివర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.