‘ఇంటెలిజెన్స్ బ్రీఫింగులు ఆయనకు ఎందుకు’ ? ట్రంప్ కు మరో ‘ఎర్త్’ పెట్టిన జో బైడెన్, పరోక్ష ఆదేశాలు !

| Edited By: Anil kumar poka

Feb 06, 2021 | 1:59 PM

క్లాసిఫైడ్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగులు (గూఢఛార సమాచార నివేదికలు) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఎందుకని అధ్యక్షుడు జో బైడెన్ ప్రశ్నించారు.

ఇంటెలిజెన్స్ బ్రీఫింగులు ఆయనకు ఎందుకు ? ట్రంప్ కు మరో ఎర్త్ పెట్టిన జో బైడెన్, పరోక్ష ఆదేశాలు  !
Follow us on

క్లాసిఫైడ్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగులు (గూఢఛార సమాచార నివేదికలు) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఎందుకని అధ్యక్షుడు జో బైడెన్ ప్రశ్నించారు. అమెరికా మాజీ అధ్యక్షులకు కూడా ఈ విధమైన నివేదికలను అందించాలన్న సంప్రదాయం ఉంది. అయితే ట్రంప్ కు ఇలాంటి నివేదికల అవసరం లేదని తాను  భావిస్తున్నానని బైడెన్ అన్నారు. ఆయనకు ఈ బ్రీఫింగుల వల్ల ప్రయోజనం ఏమిటని, వీటి ప్రభావం ఆయనపై ఏముంటుందని బైడెన్ అన్నారు. ట్రంప్ ఏదైనా నోరు జారి వ్యాఖ్యానించినా వ్యాఖ్యానిస్తారని , ఇందువల్ల చెప్పుకోదగిన ప్రయోజనం ఉంటుందని తాను అనుకోవడంలేదన్నారు. జనవరి 6 న వాషింగ్టన్ లోని క్యాపిటల్ భవనంలో అల్లర్లను రెచ్ఛగొట్టడానికి, 5 గురి మృతికి ట్రంపే బాధ్యుడని బైడెన్ ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా పేర్కొన్నారు. అమెరికా ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందని, ఎన్నికను ‘దొంగిలించారని’ ఆరోపిస్తూ ట్రంప్ లోగడ పలు కోర్టుల్లో దావాలు వేసి కూడా విఫలమయ్యారు.

వైట్ హౌస్ లో ఉండగా ఇంటెలిజెన్స్ బ్రీఫింగుల పట్ల ట్రంప్ తరచూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. 2017 లో రష్యా విదేశాంగ శాఖ మంత్రితోను, ఆ దేశ రాయబారితోను జరిపిన సమావేశంలో ఆయన..క్లాసిఫైడ్ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని వారితో షేర్ చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.  దీంతో రష్యాకు కాస్త ముప్పు ముంచుకు వచ్చిందట. 2016 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఇంటెలిజెన్స్ సమాచారం పట్ల ట్రంప్ బహిరంగంగానే సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయనను ప్రతినిధుల సభ అభిశంసించింది. సెనేట్ లో వచ్ఛేవారం  విచారణ జరగనుంది. ట్రంప్ ‘లూజ్ టంగ్’ కారణంగా జాతి భద్రత ప్రమాదంలో పడినా పడుతుందని ఆయన విమర్శకులు అంటుంటారు.

Read More: మరోసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్… నేనే గెలిచాను అంటూ పోస్ట్..

Read More: ఈ ఎన్నికలో మేమే గెలుస్తాం, జార్జియా ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ పాత పాట ! అదే మంకుపట్టు !