ఈ ఎన్నికలో మేమే గెలుస్తాం, జార్జియా ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ పాత పాట ! అదే మంకుపట్టు !
అమెరికా అధ్యక్ష ఎన్నికలో ఫ్రాడ్ జరిగిందని, ఈ ఎన్నికను దొంగచాటుగా తన నుంచి 'దొంగిలించారని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ ఎలెక్షన్ లో నేనే విజేతవుతానని పేర్కొన్నారు. జార్జియా లోని వాల్డోస్తా లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన..
అమెరికా అధ్యక్ష ఎన్నికలో ఫ్రాడ్ జరిగిందని, ఈ ఎన్నికను దొంగచాటుగా తన నుంచి ‘దొంగిలించారని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ ఎలెక్షన్ లో నేనే విజేతవుతానని పేర్కొన్నారు. జార్జియా లోని వాల్డోస్తా లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన..ఇప్పటికీ తనే విన్నర్ అని, ఈ ఎన్నికలో రిగ్గింగ్ జరిగిందని, ఇది ఫిక్స్ చేసి న డీల్ అని పాత పాటే పాడారు. ఈ రాష్ట్రంలో పోలైన ఓట్లు ఏ పార్టీది ఆధిక్యమో తేలుస్తాయి.. ఏ చట్టాన్ని రూపొందించే కమిటీది ఫస్ట్ ప్లేసో వెల్లడిస్తాయి అని ట్రంప్ పేర్కొన్నారు. మీ పిల్లలు ఓ సోషలిస్టు దేశంలోనా లేక, స్వేఛ్చాయుత దేశంలోనా పెరుగుతారో మీరే నిర్ణయిస్తారు అని వ్యాఖ్యానించారు. తన ఓటమిని అంగీకరించేందుకు సిధ్ధంగా లేనని ఆయన అంటున్నారు. ఫ్రాడ్ జరిగిందన్న తన ఆరోపణను కోర్టులు నిరాధారమైనవిగా కొట్టివేసినప్పటికీ ట్రంప్ మాత్రం తన అభిమానులను, రిపబ్లికన్లను చూడగానే రెచ్చిపోతున్నారు. జార్జియా రాష్ట్రంలో ట్రంప్ కు 12 వేల లోపు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అయితే అధ్యక్ష పదవి చేపట్టనున్న జో బైడెన్ కి 80 వేల ఓట్లకు పైగా పడినట్టు ఎన్నికల అధికారులు ఇదివరకే ప్రకటించారు.
1992 లో బిల్ క్లింటన్…. రిపబ్లికన్లకు మంచి పట్టు ఉన్న ఈ రాష్ట్రాన్ని గెలిచాక తొలి డెమొక్రటిక్ అభ్యర్థి బైడెన్ అయ్యారు. కాగా-ట్రంప్ ప్రసంగానికి ముందు ఆయన భార్య మెలనియా కొద్దిసేపు మాట్లాడారు. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ జార్జియాలో జరిగిన ట్రంప్ ర్యాలీలో అనేకమంది మాస్కులు లేకుండానే పాల్గొన్నారు. ఇక భౌతిక దూరం ఊసే లేదు.