Elon Musk: ఎలాన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. ట్రంప్‌కే ఎసరు పెట్టారుగా.. ‘అమెరికా పార్టీ’ ఏర్పాటు..

మస్క్‌ అంటే మజాక్‌ కాదు.. ఆయన ఏ పనిచేసినా సంచలనమే. అంతరిక్ష యానం నుంచి రాజకీయ ప్రస్థానం దాకా అడుగులోనూ ఒక విలక్షతే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడై, ఆ తర్వాత అదేస్థాయిలో విభేదించిన మస్క్‌, కొత్తగా మరో ముందడుగు వేశారు. తాజాగా.. స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఏకంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుచేశారు.

Elon Musk: ఎలాన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. ట్రంప్‌కే ఎసరు పెట్టారుగా.. ‘అమెరికా పార్టీ’ ఏర్పాటు..
Donald Trump Elon Musk

Updated on: Jul 06, 2025 | 7:28 AM

మస్క్‌ అంటే మజాక్‌ కాదు.. ఆయన ఏ పనిచేసినా సంచలనమే. అంతరిక్ష యానం నుంచి రాజకీయ ప్రస్థానం దాకా అడుగులోనూ ఒక విలక్షతే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడై, ఆ తర్వాత అదేస్థాయిలో విభేదించిన మస్క్‌, కొత్తగా మరో ముందడుగు వేశారు. తాజాగా.. స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఏకంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుచేశారు. ‘అమెరికా పార్టీ’ పేరుతో ఎలాన్‌ మస్క్‌ కొత్త పార్టీ నెలకొల్పుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ట్రంప్‌, మస్క్‌ మధ్య “వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్ బిల్లు” రచ్చ రాజేసింది. ఈ బిల్లును వ్యతిరేకించారు.. అయితే బిల్లు పాసైతే పార్టీ పెడతానని ముందే చెప్పారు మస్క్‌. ఈ బిల్లుపై అలా ట్రంప్‌ సంతకం చేయగానే, ఇలా పార్టీ పెడుతూ మస్క్‌ ప్రకటించడం సంచలనంగా మారింది.. ముఖ్యంగా.. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా మస్క్ రాజకీయ పార్టీ వస్తోంది. స్వేచ్ఛను తిరిగి ఇచ్చేందుకు అమెరికా పార్టీ అంటూ ఎలాన్ మస్క్‌ తన సామాజిక మాధ్యమం Xలో పోస్ట్‌ చేశారు.

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగానే మస్క్‌ తన పార్టీ ప్రకటించడం విశేషం. ప్రస్తుతం ఉన్న రెండుపార్టీల వ్యవస్థ నుంచి స్వాతంత్ర్యం ఇప్పించడం కోసమే తాను సొంత పార్టీని స్వాతంత్ర్య దినోత్సవం వేళ ప్రకటిస్తున్నాననీ, ఇదే పర్‌ఫెక్ట్‌ టైమ్‌ అని ఎలాన్ మస్క్ చెప్పారు. “ఈ రోజు, మీకు స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది” అని మస్క్ ఇటీవల నిర్వహించిన ఒక పోల్ ఫలితాలను ప్రస్తావిస్తూ రాశారు.. ఇది కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం కోసం 2-టు-1 ప్రజా కోరికను చూపించిందని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రకటన మస్క్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య బహిరంగంగా జరిగిన విభేదాల తరువాత వచ్చింది.. గతంలో ట్రంప్‌కు మద్దతుగా ఉన్న మస్క్..ఇటీవల ట్రంప్ ప్రభుత్వ ఖర్చులకు సంబంధించిన కొన్ని విధానాలను విమర్శించారు. దీనిపై ట్రంప్ కూడా మస్క్‌ను విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మస్క్ కొత్త పార్టీ ఆలోచనను తెరపైకి తెచ్చారు.. అయితే మస్క్ పార్టీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికన్ ప్రజలు.. మస్క్ పార్టీకి “ది అమెరికా పార్టీ” అనే పేరును నెటిజన్లు సూచించారు. మస్క్ దానికి సానుకూలంగా స్పందించాడు.. అలాగే ప్రకటన చేయడం సంచలనంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..