ట్రంప్‌- ఎలాన్‌ మస్క్‌ వివాదంలో కొత్త ట్విస్ట్‌

ట్రంప్‌తో గొడవపై మస్క్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.. తన పోస్టులు చాలా దూరం వెళ్లాయని వ్యాఖ్యానించారు. ట్రంప్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి వెళ్లడంతో.. వారి మధ్య సయోధ్య కష్టమే అనుకున్నారు. కానీ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

ట్రంప్‌- ఎలాన్‌ మస్క్‌ వివాదంలో కొత్త ట్విస్ట్‌
Donald Trump - Elon Musk

Updated on: Jun 11, 2025 | 1:57 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ , ఎలాన్‌ మస్క్‌ వివాదంలో కొత్త ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ట్రంప్‌పై ఆరోపణల విషయంలో వెనక్కి తగ్గారు మస్క్‌. అనవసరంగా ట్రంప్‌పై ఆరోపణలు చేశానని , అందుకు బాధపడుతున్నట్టు తెలిపారు. ట్రంప్‌పై అనవసరంగా విమర్శలు చేసినట్లు ఫీలవుతున్నట్లు చెప్పారు ఎలాన్‌ మస్క్‌.. ట్యాక్స్‌ బిల్లుపై ఇద్దరి మధ్య ప్రారంభమైన గొడవ తారాస్థాయికి చేరింది. తన సాయంతోనే ట్రంప్‌ గెలిచారని , ట్రంప్‌ రహస్యాలను బయటపెడుతానని అన్నారు మస్క్‌. . అయితే తాను సొంతంగా గెలిచానని, ఎవరి సాయం తీసుకోలేదన్నారు ట్రంప్‌. బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్‌పై ఇద్దరి మధ్య్ గొడవ జరిగింది.

డెమోక్రాట్లు , రిపబ్లికన్లతో అమెరికన్లకు న్యాయం జరగడం లేదంటున్నారు మస్క్‌. కొత్త పార్టీ దేశానికి అవసరం అంటున్నారు. దీనిపై ‘ఎక్స్‌’ వేదికగా ఓటింగ్‌ నిర్వహించారు. 80శాతం మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు. ‘ది అమెరికా పార్టీ’ అంటూ ఆయన చేసిన పోస్ట్‌ సంచలనం రేపుతోంది. కాని మస్క్‌ ఇప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కాంప్రమైజ్‌కు రెడీ అంటున్నారు ఎలాన్‌ మస్క్‌.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. President Donald Trump