Queen Elizabeth II: ముగిసిన బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్‌.. సందడి చేసిన రాజ కుటుంబం..

|

Jun 07, 2022 | 5:45 AM

Queen Elizabeth II: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్‌ ముగిశాయి. రాణి సెలబ్రేన్స్‌లో ఆమె బంగారు గుర్రపుబగ్గీ, బల్లి రాకుమారుడు లూయిస్‌ సందడి అందరినీ ఆకర్శించాయి.

Queen Elizabeth II: ముగిసిన బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్‌.. సందడి చేసిన రాజ కుటుంబం..
Queen Elizabeth Ii
Follow us on

Queen Elizabeth II: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్‌ ముగిశాయి. రాణి సెలబ్రేన్స్‌లో ఆమె బంగారు గుర్రపుబగ్గీ, బల్లి రాకుమారుడు లూయిస్‌ సందడి అందరినీ ఆకర్శించాయి. బ్రిటన్‌ రాణిగా ఎలిజబెత్‌-2 సింహాసనాన్ని అధిష్ఠించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు ముగిశాయి. ఈ వేడుకలు నాలుగు రోజల పాటు ఎంతో సందడిగా కొనసాగాయి. రాజధాని లండన్‌ మహానగరంలోని బకింగ్‌హామ్‌ ప్యాలస్‌ వేడుకలకు ప్రధాన వేదికగా మారింది. ఉత్సావాల చివరి రోజున రాణి ఎలిజబెత్‌-2 తన కుటుంబ సభ్యులతో కలిసి ప్యాలస్‌ బాల్కనీ నుంచి ప్రజలకు అభివాదం చేశారు.

రాణిగా ఎలిజబెత్‌-2 ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగం నిర్వహించిన కవాతు ఎంతో కలర్‌ఫుల్‌గా సాగింది. వెస్ట్‌మినిస్టర్‌ యాబి చర్చిలో గంటలు మోగడంతో ప్రారంభమైన రెడ్‌ కలర్‌ యూనిఫామ్‌ ధరించిన 1200 మంది సైనికులు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వరకూ పరేడ్‌ నిర్వహించారు. ఇందులో 1953లో జరిగిన తన పట్టాభిషేక వేడుకలో రాణి ఎలిజబెత్‌ 2 ఉపయోగించిన బంగారపు గురప్రు బగ్గీ కూడా ఉంది.. వేడుకలను తిలకించేందుకు బ్రిటన్‌ నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారు..

ఇక రాణి ప్లాటినం జూబ్లీ వేడుకల్లో బుల్లి రాకుమారుడు లూయిస్‌ ప్రత్యేక ఆకర్శనగా మారాడు. ఈ వేడుకల్లో ప్రిన్స్‌ విలియమ్‌ – కేట్‌ దంపతుల చిన్న కుమారుడడైన లూయిస్‌ అల్లరి, చిలిపి పనుతో సందడి చేశాడు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నాలుగు రోజుల వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. బకింగ్‌హామ్‌ ప్యాలస్‌తో పాటు లండన్‌లోని పలు కూడలులు, చారిత్రిక కట్టడాలను ఎంతో అందంగా ముస్తాబు చేశారు.