ఫారో చక్రవర్తి సమాధి.. 20 ఏళ్ల తర్వాత సందర్శకుల కోసం తెరుచుకున్న తలుపులు

ఈజిప్టులో రాజులు, రాజవంశీకులు, మత గురువుల మమ్మీలకు సంబంధించిన విశేషాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఎప్పుడు మమ్మీలు బయల్పడినా అప్పటి కాలం నాటి వింతలు విశేషాలు వెలుగులోకి వచ్చి ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటాయి. తాజాగా రెండు దశాబ్దాలకు పైగా పునరుద్ధరణల తర్వాత ఈజిప్టు అధికారులు అమెన్‌హోటెప్ III సమాధిని ప్రజలకు తిరిగి తెరిచారు.

ఫారో చక్రవర్తి సమాధి.. 20 ఏళ్ల తర్వాత సందర్శకుల కోసం తెరుచుకున్న తలుపులు
Egyptian Pharaoh Tomb Open
Image Credit source: getty iamges

Updated on: Oct 08, 2025 | 3:27 PM

ఈజిప్టులో మమ్మీలు బయటపడ్డప్పుడు ప్రపంచానికి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. తాజాగా ఈజిప్టు అధికారులు అమెన్‌హోటెప్ III సమాధిని ప్రజల సందర్శనం కోసం తిరిగి తెరిచారు. రెండు దశాబ్దాలకు పైగా పునరుద్ధరణల తర్వాత సైంటిస్టులు మమ్మీ సమాధిపై పొరను జాగ్రత్తగా తొలగించారు. ఇది క్రీస్తు పూర్వం 12వ శతాబ్దానికి చెందిన మమ్మీ . దీనిని అమెన్‌హోటెప్ ది గ్రేట్ అని కూడా పిలుస్తారు.

క్రీస్తుపూర్వం 1390 నుంచి 1350 మధ్య కాలంలో పాలించిన 18వ రాజవంశం ఫారో పాలన పురాతన ఈజిప్షియన్ నాగరికతలో ఒక శిఖరంగా పరిగణించబడుతుంది. సమాధి 1799లో కనుగొనబడింది. సైంటిస్టులు. మొదటిసారి కనుగొన్న తర్వాత దీనిలోని వస్తువులను దోచుకున్నారు. ఆ తర్వాత దాదాపు 20కి మళ్ళీ ఈ సమాధిని సందర్శనం కోసం తెరిచారు.

లక్సర్‌ నగరంలో ఫారో చక్రవర్తి సమాధిని రెండు దశాబ్దాల అనంతరం సందర్శకుల కోసం తిరిగి తెరిచారు. ఈజిప్టును క్రీస్తు పూర్వం 1390–1350 మధ్యన పాలించిన అమెన్‌హోటెప్ ద థర్డ్‌ సమాధి ‘ప్రఖ్యాత వాలీ ఆఫ్‌ కింగ్స్‌’లో పశ్చిమ దిక్కున ఉంది. దీనిని 1799లో గుర్తించారు. ఇందులోని ప్రధానమైన సార్కోఫాగస్‌(మమ్మీ) సహా ముఖ్యమైన వస్తువులు లూటీకి గురయ్యాయని ఈజిప్షియన్‌ యాంటిక్విటీస్‌ అథారిటీ తెలిపింది. 1989లో జపాన్‌ ఆర్థిక, సాంకేతిక సాయంతో జపాన్‌లోని వాసెడా విశ్వవిద్యాలయ పరిశోధకులు పని ప్రారంభించినప్పుడు సమాధి మూత ముక్కలు ముక్కలైంది. గబ్బిలాలు, తేమ కారణంగా సమాధి గోడలు నల్లబడటంతో పాటు ,ఆ ప్రదేశం ఎదుర్కొంటున్న నిర్మాణ సమస్యలు మరింత ఆందోళనకరంగా మారాయి. రెండు దశాబ్దాలపాటు మూడు దఫాలుగా ఈ సమాధి పునరుద్ధరణ పనులు సాగాయి. గోడలు నీలి-ఆకాశ నేపథ్యంలో బంగారు నక్షత్రంతో పెయింట్ చేయబడ్డాయి.

ఇవి కూడా చదవండి

ఫారో, ఆయన భార్య సమాధి గోడలపై ఉన్న చిత్రాలకు రంగులు అద్దారు. సార్కోఫాగస్‌ను ఉంచిన భారీ పెట్టె ఫ్రేమ్‌ కూడా ఇందులో ఉంది. వ్యాలీ ఆఫ్‌ కింగ్స్‌ ప్రాంతంలో 36 మీటర్ల పొడవు, 14 మీటర్ల లోతున మెట్ల దారి సమాధికి దారి తీస్తుంది. ఇందులో చక్రవర్తిని ఉంచిన ప్రధాన సమాధి ఛాంబర్‌ సహా ఆయన ఇద్దరు భార్యలకు రెండు ఛాంబర్లున్నాయి. ఇక వ్యాలీ ఆఫ్‌ కింగ్స్‌లో పురాతన ఈజిప్టును క్రీస్తుపూర్వం 1550–1292 సంవత్సరాల మధ్య పాలించిన 17 మంది రాజులు, రాణుల మమ్మీలతోపాటు మరో 16 ఇతరుల మమ్మీలున్నాయి. ఇదిలా ఉండగా పిరమిడ్స్‌కు దగ్గర్లో గ్రాండ్‌ ఈజిప్ట్ మ్యూజియంను నవంబర్‌లో ప్రారంభించనున్నారు.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..