ఇండోనేషియాలో భారీ భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదు.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య

|

Jan 15, 2021 | 9:40 AM

ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. ఈ భారీ భూకంప ప్రభావంతో ఏడుగురు మరణించగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇండోనేషియాలో భారీ భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదు.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య
Follow us on

Earthquake struck : ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. ఈ భారీ భూకంప ప్రభావంతో ఏడుగురు మరణించగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. సులావేసి దీవుల్లో మజేన్‌కు నగర సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. మాజీనీ దీవుల్లో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదైంది.

దీని ప్రభావంతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందినట్టు అధికారులు గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు ప్రకటించారు.

ఈ భూకంపంలో ఒక హోటల్, గవర్నరు కార్యాలయం తీవ్రంగా దెబ్బతిన్నాయని విపత్తు సంస్థ అధికారులు తెలిపారు. భూకంపం తర్వాత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. భూకంపం వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ నిలిచిందని అధికారులు చెప్పారు. ఈ భూకంపం వల్ల పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. 2018లో సులవేసిలో సంభవించిన భూకంపం వల్ల వచ్చిన సునామీ వల్ల వేలాదిమంది మరణించారు.