ప్రపంచానికి స్థిరత్వాన్ని అందించే బాధ్యత అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఉందని భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ పేర్కొన్నారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆయన అక్టోబర్ 6వ తేదీ గురువారం అక్కడి విదేశాంగ మంత్రి ననైయా మహుతాతో ఆక్లాండ్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలతో పాటు.. మరికొన్ని కీలక విషయాలపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ చర్చించారు. విదేశాంగ మంత్రి హోదాలో తొలిసారి ఎస్.జైశంకర్ న్యూజిలాండ్ లో పర్యటించారు. ఇండో ఫసిపిక్ ప్రాంతంలో భద్రత, ఉక్రెయిన్ సంక్షభం తదితర అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ సాగింది. న్యూజిలాండ్ విదేశాంగ మంత్రితో చర్చలు ఆశాజనకంగా సాగాయంటూ సమావేశం తర్వాత ఎస్.జై శంకర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. రెండు దేశాలు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తాయని, ఇరు దేశాల మధ్య స్నేహ బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కోవిద్ సమయంలో న్యూజిలాండ్ లో భారత విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలపైనా భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ న్యూజిలాండ్ విదేశాంగ మంత్రితో చర్చించారు. కరోనా మహమ్మారి కారణంగా న్యూజిలాండ్ లో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎంతో మంది స్వదేశానికి చేరుకున్నారని, కరోనా ప్రభావం తగ్గిన తర్వాత.. ఆ విద్యార్థుల వీసాలను పునరుద్ధరించలేదని, దీంతో విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించి భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసి చదువు కొనసాగించేందుకు సహకరించాలని సుబ్రమణ్యం జై శంకర్ కోరారు.
కోవిద్ మహమ్మారి బారిన పడిన వారి పట్ల న్యాయంగా, సానుభూతితో వ్యవహరించాలని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ న్యూజిలాండ్ విదుశాంగ మంత్రి ననైయా మహుతాను కోరారు. న్యూజిలాండ్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, సైన్స్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ వంటి వివిధ విభాగాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఎంతో మంది భారతీయ విద్యార్థులు కరోనా కారణంగా వెనక్కి వచ్చేశారు. అయితే వారి వీసాలను తిరిగి పునరుద్ధరించకపోవడంతో వారు భారత్ లోనే ఉండిపోయారు. దీంతో చదువులు మధ్యలోనే ఆగిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎస్. జైశంకర్ విజ్ఞప్తి చేశారు.
న్యూజిలాండ్ విదేశాంగ మంత్రితో సమావేశం పై ఎస్.జై శంకర్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి, కామన్వెల్త్ ఫోరమ్‌లలో న్యూజిలాండ్‌తో కలిసి పని చేయడాన్ని తాము గౌరవంగా తాము భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా వ్యాపార, విద్య, సాంకేతికత, డిజిటల్ వరల్డ్, వ్యవసాయం తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన తొలుత న్యూజిలాండ్ లో పర్యటించారు.
Was honored to start my official engagements earlier today in New Zealand with a traditional Maori welcome.
Deeply appreciate the symbolism of the convening of two energies together. The respect for customs and traditions is such an important aspect of our friendship. pic.twitter.com/mwstS6en0h
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 6, 2022
Was good to meet New Zealand’s Leader of Opposition @chrisluxonmp .
His interest in developing ties with India was manifest. Our relationship will advance with broad-based support and mutual efforts. pic.twitter.com/4OaItAfBSZ
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 6, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..