Mozambique Attack: అందమైన ఆ దేశంలో అసలు ఏం జరుగుతుంది.. బీచ్ లో శవాల గుట్టలు.. తలలు లేని మొండాలు

|

Mar 30, 2021 | 12:29 PM

Mozambique Attack: మొజాంబిక్ ఆఫ్రికాలోని ఒక అందమైన దేశం.. అంతేకాదు మొజాంబిక్ [ప్రపంచంలోని అతిపేద దేశాల్లో ఒకటి కూడా.. అయితే ఇక్కడ పల్మా పట్టణాన్ని ఓ సాయుధ ముఠా తమ నియంత్రణలోకి...

Mozambique Attack: అందమైన ఆ దేశంలో అసలు ఏం జరుగుతుంది.. బీచ్ లో శవాల గుట్టలు.. తలలు లేని మొండాలు
Mozambique Tourism
Follow us on

Mozambique Attack: మొజాంబిక్ ఆఫ్రికాలోని ఒక అందమైన దేశం.. అంతేకాదు మొజాంబిక్ [ప్రపంచంలోని అతిపేద దేశాల్లో ఒకటి కూడా.. అయితే ఇక్కడ పల్మా పట్టణాన్ని ఓ సాయుధ ముఠా తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పట్టణంతో బయటవారికి సంబంధాలు తెగిపోవడంతో ఆందోళలన వ్యక్తమవుతుంది. అక్కడ తాజా పరిస్థితి ఏమిటనేది స్పష్టతలేదని అక్కడ అధికారులు చెప్పారు.

సుమారు 75వేల మంది నివసిస్తున్న పల్మా పట్టణంపై దాడులు జరగడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతమంది మానించానే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని మొజాంబిక్ రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒమర్ సరంగా చెప్పారు. ఇక ఇక్కడ బీచ్ లో శవాలు భయంకరంగా కనిపిస్తున్నాయి. వాటిల్లో కొన్నింటికి తల లేకుండా కేవలం మొండెం మాత్రమే ఉన్నాయని ఓ భద్రత సంస్థ అధికారి చెప్పారు.

పల్మా పట్టణం నుంచి పారిపోవడానికి కార్గోలు, ఓడలు, పర్యాకుల పడవలను ఉపయోగిస్తున్నారు. పల్మా కూడా రేవుకు చేరుకున్న సహాయక బృందం చర్యలను చేపట్టారు. ఇక మొజాంబిక్‌లోని ఉత్తర ప్రాంతంలో 2017 నుంచి పలు తిరుబాట్లు జరుగుతున్నాయి. ముస్లింలు ఎక్కువగా ఉండే కాబో డెల్గాడో ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)తో సంబంధాలున్న మిలిటెంట్ల కారణంగా సంక్షోభం ఏర్పడింది. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

Also Read: వంటలక్క లేటెస్ట్ ఫోటోలు.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్

Vegetable Powders: వేసవిలో పచ్చళ్ళు, వడియాలే కాదు.. కొన్నిరకాల కూరగాయలతో పొడులను కూడా తయారు చేసుకోవచ్చు తెలుసా..!