Boat Accident: ఘోర ప్రమాదం.. నదిలో పడవ బోల్తా.. 60 మంది దుర్మరణం.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు

|

Feb 16, 2021 | 7:16 AM

Boat Accident: కాంగో నదిలో ఓ పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో 60 మంది ప్రయాణికులు మృతి చెందారు. మాయి నోడోంబీ ప్రావిన్స్‌లోని లాంగోలా ఎకోటి గ్రామానికి...

Boat Accident: ఘోర ప్రమాదం.. నదిలో పడవ బోల్తా.. 60 మంది దుర్మరణం.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు
Follow us on

Boat Accident: కాంగో నదిలో ఓ పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో 60 మంది ప్రయాణికులు మృతి చెందారు. మాయి నోడోంబీ ప్రావిన్స్‌లోని లాంగోలా ఎకోటి గ్రామానికి సమీపంలోని నదిలో ఓడ ప్రమాదవశాత్తు ఓడ మునిగిపోయింది. ప్రమాద సమయంలో ఓటలో 700 మంది ప్రయాణికులున్నారని కాంగో మంత్రి ఎంబీకాయి వెల్లడించారు. పడవ మునిగిన తర్వాత 60 మంది మృతదేహాలను వెలికి గాయగా, మరి కొంత మంది గల్లంతయ్యారని మంత్రి తెలిపారు. అయితే ఓడలో ఉన్న వారిలో 300 మంది వరకు ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు.

ఈ ఓడ కిన్హాసా నుంచి బయలుదేరి భూమధ్య రేఖ ప్రావిన్స్‌ వైపు వెళ్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. పడవలో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటంతో అధిక లోడ్‌ అయి పడవ మునిగిపోయినట్లు మంత్రి వివరించారు. అయితే పడవ మునిగినట్లు సమాచారం తెలియగానే సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Also Read: Myanmar Military Action: ఆర్మీ నిర్బంధంలో మయన్మార్.. ప్రజల మీదికి ఖైదీల అస్త్రం.. సైన్యం నిర్ణయంపై ఆగ్రహం