అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు టిఫానీ ట్రంప్ పెళ్లిపీటలెక్కారు. టిపానీ తన ప్రియుడు వ్యాపారవేత్త మైఖెల్ బౌలోస్‌ను పెళ్లి చేసుకున్నారు. ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన మార్ ఎ లాగో రిసార్ట్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నాలుగేళ్ల ప్రేమాయాణం అనంతరం మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటైంది. పెళ్లిలో తెలుపు రంగు గౌను ధరించి మెరిసిపోయారు టిఫానీ ట్రంప్.. తన కూతురు టిఫానీని వెంటబెట్టుకొని వివాహ వేదికకు తీసుకువచ్చారు. ఈ వేడుకకు ట్రంప్ కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు మాత్రమే హాజరై నూతన వధువరూలను ఆశీర్వదించారు. ట్రంప్ భార్య మెలానియా, మరో కూతురు ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జేర్డ్ కుష్నర్, జూనియర్ డొనాల్డ్ ట్రంప్, ఎరిక్ ట్రంప్, బారన్ ట్రంప్ ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా.. ఈ పెళ్లి ఫొటోలను యూఎస్ కాంగ్రెస్ లీడర్ అన్న పాలినా లునా షేర్ చేసి.. శుభాకాంక్షలు తెలిపారు.
2018లో టిఫానీ, మైఖెల్‌కు పరిచయం ఏర్పడింది.. వెకేషన్ కోసం లండన్ వెళ్లినప్పుడు టిఫానీ ట్రంప్ తొలిసారిగా బౌలోస్‌ను కలిశారు. మైఖేల్ సంపన్న లెబనీస్ కుటుంబానికి వారసుడు.. అప్పట్లో అక్కడి యూనివర్సిటీలో చదువుతుండేవాడు. ఆ తర్వాత 2019లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తమ ప్రేమను ప్రపంచానికి పరిచయం చేశారు. అనంతరం ఇరుకుటుంబాలు కూడా వారి ప్రేమను ఒప్పుకున్నాయి.
Congratulations @TiffanyATrump ✨! pic.twitter.com/Mfb3uN4Ami
— Anna Paulina Luna (@VoteAPL) November 13, 2022
2021 జనవరిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడి పదవి నుంచి తొలగిపోయే ముందు ఎంగేజ్‌మెంట్ జరిగింది. డొనాల్డ్ ట్రంప్.. ఆయన రెండో భార్య, నటి మార్ల మాపుల్స్ ఏకైక కూతురే టిఫానీ. 1993లో మార్లను ట్రంప్ వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో 1999లో విడాకులు తీసుకున్నారు. అనంతరం మెలానియాను డొనాల్డ్ ట్రంప్ వివాహమాడారు.
Happy Father’s Day, Dad! I’m so grateful for your boundless love?, hilarious sense of humor, and for always believing in me! ❤️ pic.twitter.com/LJ7zbA1vt6
— Tiffany Ariana Trump (@TiffanyATrump) June 20, 2021
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..