Donald Trump: అధ్యక్ష ఎన్నికల బరిలో నేనూ ఉన్నా.. అమెరికా మాజీ అధ్యక్షుడి ప్రకటన

ఏ దేశంలో ఎన్నికలు జరిగినా పట్టించుకోము, కానీ అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయంటే ఎందుకో తెలియని ఆసక్తి ఉంటుంది అభ్యర్థులలో ఎవరు గెలుస్తారని..

Donald Trump: అధ్యక్ష ఎన్నికల బరిలో నేనూ ఉన్నా.. అమెరికా మాజీ అధ్యక్షుడి ప్రకటన
Donald Trump

Updated on: Nov 16, 2022 | 3:25 PM

ఏ దేశంలో ఎన్నికలు జరిగినా పట్టించుకోము, కానీ అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయంటే ఎందుకో తెలియని ఆసక్తి ఉంటుంది అభ్యర్థులలో ఎవరు గెలుస్తారని.. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి తెలియనివారు ఉండరు. ఆయన తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే.. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారని. ఎన్నికలు జరగడానికి ఇంకా రెండు సంవత్సరన్నర కాలం ఉండగానే ఆయన ఈ ప్రకటన చేశారు. వెళ్తే.. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2024లో ఆ దేశంలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన అమెరికా ఫెడరల్ ఎలక్షన్ కమిషన్‌లో తన పత్రాలను దాఖలు చేశారు.

దీంతో.. రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీల నుంచి అధికారికంగా తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన మొదటి ప్రధాన అభ్యర్థిగా ట్రంప్ నిలిచారు. అనంతరం ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో బాల్‌రూమ్‌లో నుంచి తన మద్దతుదారులతో ‘‘అమెరికా పునరాగమనం ఇప్పుడే ప్రారంభమవుతుంది. నేను ఈ రోజు రాత్రి అమెరికా అధ్యక్ష పదవి కోసం నా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నా’’అని అన్నారు.

వ్యాపార దిగ్గజం, రియాలిటీ టీవీ స్టార్ అయిన డోనాల్డ్ ట్రంప్ 2016 ఎన్నికల్లో సాధించిన విజయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 2021 అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత తన పదవిని కోల్పోయిన ట్రంప్‌కు ఇప్పటికీ అనుచరుల నుంచి అపారమైన ప్రజాదరణ లభిస్తుంది. అయితే, ట్రంప్ రాజకీయ ఎదుగుదలకు సోషల్ మీడియా కీలకమైనది కాగా ఫేస్‌బుక్, ట్విట్టర్ ప్లాట్‌పామ్‌లు ఆయనను నిషేధించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ప్రపంచ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..