Video: అఫ్ఘాన్‌లో భారీ భూకంపం.. ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారంటే!
ఆఫ్ఘానిస్తాన్‌లో భూకంపం సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య అతకంతకూ పెరుగుతుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు సుమారు 1400 మంది వరకు మరణించారని, మరో 3వేల మంది వరకు గాయపడినట్టు అఫ్ఘాన్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మృతుల సంఖ్య మరింత పెరేగే అవకాశం ఉందన్ని వర్గాలు పేర్కొన్నాయి.

ఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.0 తీవ్రత నమోదైంది. ఈ భూకంపం దాటికి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన కునార్ ప్రావిన్స్ సమీపంలోని ఆరు గ్రామాలు ధ్వంస మయ్యాయి. చాలా చోట్ల ఎత్తైన భవనాలు నేలకూలాయి. ఈ ప్రమాదదంలో ఇప్పటి వరకు సుమారు 1400 మంది వరకు మరణించినట్టు అధికార వర్గాలు వెల్లడించారు. మరో 3000 మంది తీవ్రంగా గాయపడ్డట్టు అధికారులు గుర్తంచారు.
ఇదిలా ఉండగా భూకంపం ధాటికి ధ్వంసమైన ఆరు గ్రామాల్లోని శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్టు అధికారులు గుర్తించారు. వారిని కాపాడేందుకు రంగలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. శిథిలాల నుంచి బటయకు తీసిన వారిని హెలికాప్టర్ల సహాయంతో హాస్పిటల్స్‌కు తరలిస్తున్నారు.
వీడియో చూడండి..
Afghanistan earthquake: Death toll crosses 1,400, over 3,000 injured
An aerial view of Kunar Province after a 6.0-magnitude earthquake struck the region.
The footage shows widespread destruction of villages#Kunar #Afghanistan #KunarEarthquake #AfghanistanEarthquake pic.twitter.com/fOk4bTl2hb
— JUST IN | World (@justinbroadcast) September 2, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
