Punjab Assembly: పాకిస్థాన్(Pakistan)లోని పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ రణరంగంగా మారింది. ఇమ్రాన్‌ఖాన్(Imran Khan) పార్టీ పీటీఐకి చెందిన ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్‌పై దాడి చేశారు. పీటీఐ(PTI) నేతల దాడిలో డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజ్రీ గాయపడ్డారు. పీటీఐ ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్‌ను చెప్పుతో కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చేశారరని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం స్పీకర్ పరిస్థితి సురక్షితంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నికునేందుకు శనివారం సమావేశమైన అసెంబ్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజారీ సభకు అధ్యక్షత వహించడానికి వచ్చారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పిటిఐ ఎమ్మెల్యేలు అతనిని అడ్డుకుని తీవ్రంగా కొట్టారు. పీటీఐ ఎమ్మెల్యేలు ఆయనపై వాటర్ బాటిల్ విసిరినట్లు సమాచారం. ఈ సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు. పంజాబ్ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, పీటీఐ సభ్యులు గైర్హాజరు కావడంతో వాయిదా పడింది. మరోసారి సమావేశం కాగానే, అలస్యంగా అసెంబ్లీకి వచ్చిన పీటీఐ ఎమ్మెల్యేలు తమతో పాటు చీటీలు తెచ్చుకున్నారని, ఆ తర్వాత పెద్దఎత్తున కేకలు వేయడం ప్రారంభించారు. ఇమ్రాన్‌ఖాన్ పార్టీని వీడి ప్రతిపక్షాలకు మద్దతిచ్చిన నేతలపై వ్యంగ్యంగా ప్రవర్తిస్తూ గోల చేశారు. సభను క్రమబద్ధీకరించే క్రమంలో జోక్యం చేసుకున్న డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజ్రీపై దాడి చేశారు.
آج اسمبلی میں جو کچھ ہوا وہ میرے علم میں ہے کہ کس نے کروایا اور کون کون لوگ ملوث ہیں۔
میری HC اور قوم سے کمٹمنٹ ہے کہ اسمبلی کا اجلاس بھی آج ہی ہو گا اور وزیراعلیٰ کا الیکشن بھی آج ہی ہو گا۔میر صاحب گواہ رہیے گا، میں آئین سے وفاداری نبھا کر رہوں گا۔@HamidMirPAK @asmashirazi pic.twitter.com/V871J4X5yy
— ?????? ???? ? ?????? (@Dost_M_Mazari) April 16, 2022
లాహోర్ హైకోర్టు ఆదేశాలను అనుసరించి, పంజాబ్‌లో కొత్త ముఖ్యమంత్రి కోసం ఎన్నికలు నిర్వహించేందుకు ఒక సెషన్‌ను పిలిచారు. హంజా షాబాజ్, చౌదరి పర్వేజ్ ఇలాహి మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిన సెషన్‌కు దోస్త్ మహ్మద్ మజ్రీ అధ్యక్షత వహించారు. కొత్త ముఖ్యమంత్రి కోసం హమ్జా షాబాజ్,పర్వేజ్ ఎలాహి మధ్య పోటీ నెలకొంది. హమ్జా PML N ఇతర పార్టీల అభ్యర్థి. ఇమ్రాన్ పార్టీ పిటిఐ పిఎంఎల్ క్యూకి చెందిన ఇలాహికి మద్దతు ఇస్తోంది.
How PTI members attacked @DostM_Mazari in #PunjabAssembly#وزیراعلی_حمزہ_شہبازشریف #PMLN pic.twitter.com/AEPbQGhenw
— Afzaal Abbasi (@imafzaal5) April 16, 2022
ముందస్తు ఎన్నికలకు, డిప్యూటీ స్పీకర్ అధికారాలను పునరుద్ధరించడానికి హంజా చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన లాహోర్ హైకోర్టు బుధవారం ఉత్తర్వులకు అనుగుణంగా శనివారం నాటి సెషన్ జరిగింది. గత వారం డిప్యూటీ స్పీకర్ అధికారాలను ఉపసంహరించుకున్నారు. ఏప్రిల్ 16న ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆయనను కోరింది ఈ నేపథ్యంలో పంజాబ్ అసెంబ్లీ సమావేశం అయ్యింది.
Read Also… Bird Flu: బర్డ్ ఫ్లూ కలకలం.. అక్కడ చికెన్ తినడంపై ఆంక్షలు విధించిన వైద్యులు..