మంచు కొలనులో ఇరుక్కుపోయిన జింక..బయటకు రాలేక విలవిల
అమెరికాలో మంచు బీభత్సం సృష్టిస్తోంది. పలు ప్రాంతాల్లో 20 అంగుళాల మేర మంచు పేరుకుపోతోంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో స్థానిక ప్రజలు గజగజలాడిపోతున్నారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే ఇక మూగజీవాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మంచు ప్రాంతమైన వ్యోమింగ్ రాష్ట్రంలోని డేనియల్ పట్టణంలో ఓ జింక నీరు తాగేందుకు ఓ కొలను దగ్గరకు వెళ్లి..అందులో పడిపోయింది. గడ్డ కట్టిన మంచునుంచి బయటకొచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీలుకాక విలవిలలాడిపోయింది. స్థానికులందించిన సమాచారంతో […]
అమెరికాలో మంచు బీభత్సం సృష్టిస్తోంది. పలు ప్రాంతాల్లో 20 అంగుళాల మేర మంచు పేరుకుపోతోంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో స్థానిక ప్రజలు గజగజలాడిపోతున్నారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే ఇక మూగజీవాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
మంచు ప్రాంతమైన వ్యోమింగ్ రాష్ట్రంలోని డేనియల్ పట్టణంలో ఓ జింక నీరు తాగేందుకు ఓ కొలను దగ్గరకు వెళ్లి..అందులో పడిపోయింది. గడ్డ కట్టిన మంచునుంచి బయటకొచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీలుకాక విలవిలలాడిపోయింది. స్థానికులందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు..ఆ జింకను తాడుతో కట్టి బయటకు లాగారు. ప్రాణాపాయం తప్పిన జింక కొద్ది సేపటి తర్వాత అక్కడి నుంచి క్షేమంగా వెళ్లిపోయింది..