New Variant Deltacron: భయపెడుతున్న మరో కొత్త వేరియంట్‌.. ‘డెల్టాక్రాన్’గా నామకరణం..!

|

Feb 18, 2022 | 9:15 AM

New Variant Deltacron: బ్రిటన్ ప్రజలను మరో కొత్త వేరియంట్ భయపెడుతుంది. న్యూ వేరియంట్ డెల్టాక్రాన్ గా గుర్తించారు. తీవ్రతపై నిపుణులు కీలక ప్రకటన చేశారు. కరోనా..

New Variant Deltacron: భయపెడుతున్న మరో కొత్త వేరియంట్‌.. ‘డెల్టాక్రాన్’గా నామకరణం..!
Follow us on

New Variant Deltacron: బ్రిటన్ ప్రజలను మరో కొత్త వేరియంట్ భయపెడుతుంది. న్యూ వేరియంట్ డెల్టాక్రాన్ గా గుర్తించారు. తీవ్రతపై నిపుణులు కీలక ప్రకటన చేశారు. కరోనా మహమ్మారి మొదలై రెండేళ్లు దాటినా.. తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. అంతమనేది లేకుండా రోజుకో కొత్త రూపంలో ప్రపంచంపై దాడి చేస్తుంది. ఇప్పటికే ఆల్ఫా, డెల్టా, బీటా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు విజృంభించి, అతలాకుతలం చేశాయి. లాస్ట్ ఇయర్ దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ మిగతా వాటికంటే అత్యంత వేగంగా వ్యాపించింది. దీని తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ కేసుల రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. మళ్లీ ఇప్పుడు బ్రిటన్‌లో కరోనా కొత్త రకం వేరియంట్‌ను గుర్తించారు సైటిస్టులు. న్యూ వేరియంట్ ను ‘డెల్టాక్రాన్’ గా నామకరణం చేశారు. డెల్టాక్రాన్ కేసులను గుర్తించారు. డెల్టాగా.. ఒమిక్రాన్ ఈ రెండు రకాలను పోలిన లక్షణాలు కనిపిస్తుండడంతో దీన్ని డెల్టాక్రాన్‌గా పిలుస్తున్నారు. డెల్టాక్రాన్‌ను 2021 డిసెంబర్‌లో గుర్తించారు. అయితే యూకేలో డెల్టా, ఒమిక్రాన్‌ లక్షణాలు ఉన్న 25 కేసులు నమోదు కాగా, ఆ శాంపిళ్లను జనవరి 7న జన్యు విశ్లేషనకు పంపించారు. అందులో డెల్టా జన్యువులతో పాటు ఒమిక్రాన్‌ జన్యువులు కూడా ఉన్నాయి. అయితే ముందుగా దీనిని ల్యాబ్‌ ఎర్రర్‌గా తోసిపుచ్చాయి. ఆ తర్వాత పరీక్షల్లో హైబ్రిడ్‌ స్ట్రెయిన్‌గా నిర్ధారించారు. డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్ల రీకాంబినేషన్‌లో ఈ కొత్త వేరియంట్‌ డెల్టాక్రాన్‌ ఏర్పడినట్లు స్పష్టమవుతోంది.

డెల్టా, ఒమిక్రాన్ లక్షణాలు డెల్టాక్రాన్ కేసుల్లో ఉన్నట్టు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. ఈ కేసులను స్టడీ చేస్తున్నట్లు UKHSA చెప్పింది. అయితే ఇన్ఫెక్షన్ తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదీ, లక్షణాల తీవ్రత గురించి మాత్రం వివరాలు వెల్లడించలేదు. అయితే ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. ఒమిక్రాన్ స్వల్ప లక్షణాలకే పరిమితమైనప్పటికి.. డెల్టాక్రాన్ మాత్రం మునుపటి వేరియంట్ల మాదిరిగా అంత ప్రభావం చూపించకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. కానీ, సైప్రస్ లో డెల్టాక్రాన్‌ను గుర్తించిన సైటిస్టులు డెల్టా, ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తిస్తుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

India Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గత 24గంటల్లో ఎన్నంటే..?

Coronavirus: దేశంలో కరోనా మరణాలు 32- 37 లక్షలంటూ కథనాలు.. కేంద్రం ఏమంటోందంటే..