Watch Video: విమానం గాల్లో ఉండగానే ఇంజన్‌లో చెలరేగిన మంటలు.. తర్వాత ఏం జరిగిందంటే?

అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్ లైన్స్ విమానానికి పెనుప్రమాదం తప్పింది. సుమారు 294 మంది ప్రయాణికులతో లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కాసేపటికే డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానం ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ఫైలట్‌ వెంటనే ఫ్లైట్‌ను అత్యవసర ల్యాండింగ్‌ చేయడంతో ప్రయాణికులందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Watch Video: విమానం గాల్లో ఉండగానే ఇంజన్‌లో చెలరేగిన మంటలు.. తర్వాత ఏం జరిగిందంటే?
Delta Flight

Updated on: Jul 20, 2025 | 9:32 AM

అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన తర్వాత బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాల భత్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదంలో 270 మందికిపై మరణించిన ఘటన మరువక ముందే మరో పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది సహా సుమారు 294 మంది ప్రయాణికులతో లాస్‌ ఏంజిల్స్‌ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి అట్లాంటాకు బయల్దేరిన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ప్రమాదానికి గురైంది. ఫ్లైట్‌ గాల్లో ఉండగానే ఇంజన్‌లోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన పైలెట్‌ అప్రమత్తమై వెంటనే విమానాన్ని లాస్‌ ఏంజిల్స్ ఎయిర్‌పోర్టులో అత్యవరంగా ల్యాండ్‌ చేశాడు. దీంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

టేకాఫ్‌ అయిన కాసేపటికే ఇంజన్‌లో మంటలు

ఏవియేషన్ A2Z నివేదిక ప్రకారం.. బోయింగ్ 767-400 (రిజిస్ట్రేషన్ N836MH) నడుపుతున్న ఫ్లైట్ DL446, లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అంట్లాంటాకు బయలుదేరింది. ఫ్లైట్‌ రన్‌వే నుంచి టేకాఫ్‌ అయిన కాసేపటికే విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగుతున్నట్లు సిబ్బంది గుర్తించారు. గ్రౌండ్ వీడియో ఫుటేజ్‌లో ప్రకారం విమానం ఎడమ వైపు ఇంజిన్ నుండి గాలిలో మంటలు వస్తున్నట్లు మనం చూడవచ్చు. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం ఏటీసీకి సమాచారం ఇచ్చాడు. ఫ్లైట్‌ ల్యాండింగ్‌ ఏటీసీ గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడంతో గాల్లో ఉన్న ఫ్లైట్‌ను పైలట్‌ చాకచక్కంగా ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేశాడు. ఫ్లైట్ ల్యాండింగ్ అయిన వెంటనే, ఎమర్జెన్సీ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలోని ప్రయాణికులందరూ సేఫ్ అయ్యారు.

ప్రమాదంపై స్పందించిన డేల్టా

మరోవైపు ఈ విమాన ప్రమాదంపై డేల్టా ప్రతినిధి స్పందించారు. డెల్టా విమానం 446 బయలుదేరిన కొద్దిసేపటికే విమానం ఎడమ ఇంజిన్‌లో సమస్య ఉన్నట్లు గుర్తించడంతో లాస్ ఏంజిల్స్‌కు తిరిగి వచ్చినట్టు పేర్కొన్నారు. ఫ్లైట్‌ ల్యాండ్‌ అయిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఇంజిన్ మంటలు ఆరిపేశారని తెలిపారు.ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అగ్ని ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తు ప్రారంభించింది.

వీడియో చూడండి..

 

ఏదాదితో రెండో సారి..

అయితే ఈ ఏడాదిలొ డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానంలో ఇలా మంటలు చెలరేగడం ఇది రెండో సంఘటన అని తెలుస్తోంది. గత జనవరిలో, ఎయిర్‌బస్ A330neo విమానం DL105, బ్రెజిల్‌లోని సోపాలోకు వెళ్తున్న క్రమంలో ఇలాంటి సమస్య కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అట్లాంటా ఎయిర్‌పోర్టుకు తిరిగి రావలసి వచ్చింది. జనవరి 1న విమానం సో పాలోలోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని ఎడమ ఇంజిన్ మంటల్‌ చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్‌ ఫ్లైట్‌ను అత్యవస ల్యాండింగ్ చేశాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.