PM Modi: బ్రెజిల్‌ చేరుకున్న ప్రధాని.. ఎయిర్‌పోర్టులో మారుమోగిన మోదీ నామం..

|

Nov 18, 2024 | 11:14 AM

భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటనలో భాగంగా బ్రెజిల్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. మోదీ నామంతో ఎయిర్‌ పోర్ట్‌ పరిసర ప్రాంతాల్లో మారుమోగింది. అలాగే కొందరు సంస్కృత శ్లోకాలతో ప్రధాని స్వాగతం పలకడం హైలెట్‌గా నిలిచింది..

PM Modi: బ్రెజిల్‌ చేరుకున్న ప్రధాని.. ఎయిర్‌పోర్టులో మారుమోగిన మోదీ నామం..
Pm Modi
Follow us on

భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్‌ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం బ్రెజిల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్‌ చేరుకున్న విషయం తెలిసిందే. ప్రధానికి బ్రెజిల్‌లో ఘన స్వాగతం లభించింది. అక్కడి అధికారులు రెడ్‌ కార్పెట్‌తో ఆహ్వానించారు. ఇక మోదీకి ఆహ్వానం పలికేందుకు విమానశ్రయానికి పెద్ద ఎత్తున ఎన్‌ఆర్‌ఐలు విచ్చేశారు.

ఎయిర్‌పోర్ట్‌లో మోదీ నామం మారుమోగింది. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వారితో ఈ సందర్భంగా మోదీ కాసేపు ముచ్చటించారు. ఇక బ్రెజిల్‌లో ఉన్న కొందరు భారతీయులు సంస్కృత శ్లోకాలతో ప్రధానికి స్వాగతం పలికారు. ఇది హైలెట్‌గా నిలిచింది. ఇక జీ20 సదస్సులో భాగంగా మోదీ నేడు నేడు పలు దేశాధినేతలతో సమావేశం కానున్నారు. ఈ రోజు, రేపు జరగనున్న జరిగే జీ-20 సదస్సులో ప్రధాని మోదీతో పాటు, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, US అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఉన్నారు. గతేడాది భారత్‌లో జరిగిన జీ-20 సదస్సు.. ఇప్పుడు బ్రెజిల్‌లో జరగనుంది.

జీ-20 సదస్సు తర్వాత ప్రధాని మోదీ.. గయానాకు వెళ్లనున్నారు. గయానా అధ్యక్షుడైన మొహమ్మద్​ ఇర్ఫాన్​ అలీ అహ్వానం మేరకు ఆయన ఆ దేశంలో నవంబర్ 21వ తేదీ వరకు ఉండనున్నారు. గయానాలో జరగనున్న ఇండియా- కరికోమ్ సదస్సులో కామన్వెల్త్​ ఆఫ్​ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రదానం చేయనున్నారు. అయితే, 50 ఏళ్ల తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..